Iran Earthquake| యుద్దం వేళ…ఇరాన్ లో భూకంపం !

ఇరాన్ లో భూకంపం సంభవించడంతో ఆ దేశ ప్రజలు తీవ్ర భయాందోళనలకు లోనయ్యారు. ఓ వైపు యుద్ద పరిస్థితుల మధ్య మిసైళ్లు, బాంబుల దాడులతో దద్దరిల్లిపోతున్న ఇరాన్ దేశంలో సంభవించిన భూకంపం ప్రకంపనలతో ఆ దేశ ప్రజలు వణికిపోయారు.

Reported by: Y.V. Narsimha Reddy | Latest News | Mar 03, 2026, 5:41 pm IST
Read Time: 2 mins
Iran Earthquake| యుద్దం వేళ…ఇరాన్ లో భూకంపం !

న్యూఢిల్లీ : అమెరికా, ఇజ్రాయెల్ లతో పాటు వాటి మిత్ర పక్ష గల్ఫ్ దేశాలతో యుద్దం చేస్తున్న ఇరాన్ కు ప్రకృతి మరో సవాల్ విసిరింది. ఇరాన్ లో భూకంపం సంభవించడంతో ఆ దేశ ప్రజలు తీవ్ర భయాందోళనలకు లోనయ్యారు. ఓ వైపు యుద్ద పరిస్థితుల మధ్య మిసైళ్లు, బాంబుల దాడులతో దద్దరిల్లిపోతున్న ఇరాన్ దేశంలో సంభవించిన భూకంపం ప్రకంపనలతో ఆ దేశ ప్రజలు వణికిపోయారు.

ఇరాన్ భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్ పై 4.3గా నమోదైంది. గెరాష్ ప్రాంతంలో భూకంప కేంద్రాన్ని గుర్తించారు. భూకంపం తీవ్రత నేపథ్యంలో భారీగా ఆస్తి, ప్రాణ నష్టం ఉండే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఇప్పటికే క్షిపణి దాడులతో అల్లకల్లోలమైన ఇరాన్ ప్రజలకు భూకంపంతో మరిన్ని కష్ట నష్టాలు ఎదుర్కొనే పరిస్థితి నెలకొంది.