Beggar Last Rites | బిచ్చ‌గాడికి ఘ‌నంగా అంతిమ‌యాత్ర‌.. రూ. 40 వేల‌తో పెద్ద‌క‌ర్మ‌

బిచ్చ‌గాళ్లు( Beggar ) అంటేనే ఈ స‌మాజంలో చిన్న‌చూపు ఉంటుంది. బిచ్చ‌గాళ్ల‌ను సాటి మ‌న‌షులుగా గుర్తించ‌రు. కానీ ఓ గ్రామానికి చెందిన ప్ర‌జ‌లంతా.. ఓ బిచ్చ‌గాడి ప‌ట్ల మాన‌వ‌త్వం ప్ర‌ద‌ర్శించారు.

Beggar Last Rites | బిచ్చ‌గాడికి ఘ‌నంగా అంతిమ‌యాత్ర‌.. రూ. 40 వేల‌తో పెద్ద‌క‌ర్మ‌

Beggar Last Rites | బిచ్చ‌గాళ్లు( Beggar ) అంటేనే ఈ స‌మాజంలో చిన్న‌చూపు ఉంటుంది. బిచ్చ‌గాళ్ల‌ను సాటి మ‌న‌షులుగా గుర్తించ‌రు. కానీ ఓ గ్రామానికి చెందిన ప్ర‌జ‌లంతా.. ఓ బిచ్చ‌గాడి ప‌ట్ల మాన‌వ‌త్వం ప్ర‌ద‌ర్శించారు. నిత్యం త‌మ‌తో మమేక‌మ‌వుతూ.. ఆప్యాయంగా ప‌లుక‌రిస్తూ.. ప్రాణాలు విడిచిన బిచ్చ‌గాడి ప‌ట్ల ఆ గ్రామ‌స్తులు గొప్ప మ‌న‌సు చాటుకున్నారు. ఘ‌నంగా అంతిమ‌యాత్ర నిర్వ‌హించారు. అంత‌టితో ఆగ‌కుండా ఆ బిచ్చ‌గాడి ఆత్మ‌కు శాంతి చేకూరాల‌నే ఉద్దేశంతో రూ. 40 వేల‌తో పెద్ద‌క‌ర్మ నిర్వ‌హించి.. త‌మ ప్రేమను చాటుకున్నారు.

వివ‌రాల్లోకి వెళ్తే.. ఖ‌మ్మం జిల్లా( Khammam District ) వైరా మండ‌ల ప‌రిధిలోని గొల్లెన‌పాడు( Gollenapadu ) గ్రామంలో తాటికొండ భాస్క‌ర్( Thatikonda Bhasker ) అనే వ్య‌క్తి విక‌లాంగుడు. అత‌నికి ఎవ‌రూ లేరు. దీంతో గ్రామంలో భిక్షాట‌న చేస్తూ క‌డుపు నింపుకునేవాడు. త‌న‌కు అన్నం పెట్టి ఆద‌రిస్తున్న వారంద‌రినీ ఆప్యాయంగా ప‌లుక‌రించేవాడు. గ్రామ‌స్తుల‌తో క‌లిసిమెలిసి ఉండేవాడు. ఇక గ్రామ మాజీ స‌ర్పంచ్ వెంప‌టి వెంక‌టేశ్వ‌ర్లు ఇంటి స‌మీపంలో భాస్క‌ర్ నివ‌సిస్తుండేవాడు.

అయితే అక్టోబ‌ర్ రెండో వారంలో భాస్క‌ర్ తీవ్ర అస్వ‌స్థ‌త‌కు గుర‌య్యాడు. అక్టోబ‌ర్ 25న ప్రాణాలు విడిచాడు భాస్క‌ర్. దీంతో గ్రామ‌స్తులంతా క‌లిసి భాస్క‌ర్ మృత‌దేహానికి ఘ‌నంగా అంతిమ‌యాత్ర నిర్వ‌హించారు. అనంత‌రం స్మ‌శాన వాటిక‌లో బిచ్చ‌గాడి మృత‌దేహాన్ని పూడ్చిపెట్టారు.

అంత‌టితో ఆగిపోకుండా.. భాస్క‌ర్ ఆత్మ‌కు శాంతి చేకూరాల‌నే ఉద్దేశంతో.. గ్రామ‌స్తులంతా క‌లిసి పెద్దక‌ర్మ నిర్వ‌హించారు. పెద్ద‌క‌ర్మ వేడుక కోసం గ్రామ‌స్తులంద‌రూ రూ. 40 వేలు వ‌సూలు చేశారు. ఆ డ‌బ్బుతో పెద్ద‌క‌ర్మ నిర్వ‌హించి, స్థానికుల‌కు భోజ‌నాలు వ‌డ్డించారు. కొంద‌రు చికెన్, మ‌రికొంద‌రు బియ్యం, ఇంకొంద‌రు టెంట్ త‌దిత‌ర వ‌స్తువుల‌ను విరాళంగా అందించారు.