Beggar | యాచకుడి ప్రజాసేవ.. భిక్షం ఎత్తుకోగా వచ్చిన డబ్బుతో నిరాశ్రయులకు దుప్పట్లు పంపిణీ
తన కడుపు నింపుకోవడమే కష్టమైన స్థితిలోనూ, భిక్షాటన ద్వారా వచ్చిన డబ్బుతో పఠాన్‌కోట్ యాచకుడు రాజు 500 దుప్పట్లు కొని నిరాశ్రయులకు పంపిణీ చేసి మానవత్వాన్ని చాటాడు.
Beggar | కోటీశ్వరుడైనా సరే ఆపదలో ఉన్న వారికి సాయం చేసేందుకు వెనుకాడే ఈ రోజుల్లో.. ఓ యాచకుడు (Beggar) తన దాతృత్వంతో అందరి మనసును గెలుచుకున్నాడు. యాచించడం ద్వారా వచ్చిన డబ్బుతోనే నిరాశ్రయులకు దుప్పట్లు (Blankets) పంపిణీ చేసి అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నాడు.
దేశవ్యాప్తంగా చలి తీవ్రత (cold wave grips) పెరిగింది. ముఖ్యంగా ఉత్తర భారతం (North India)లో చలి పంజా విసురుతోంది. ఉష్ణోగ్రతలు అత్యంత కనిష్ట స్థాయికి పడిపోయాయి. చలి గాలులకు ప్రజలు గజగజ వణికిపోతున్నారు. చలి మంటలు వేసుకుని ఉపశమనం పొందుతున్నారు. ఇక ఈ చలికి ఇండ్లు లేని వారి పరిస్థితి అయితే చెప్పనక్కర్లేదు. ఎముకలు కొరికే చలిలో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇలాంటి సమయంలో ఓ యాచకుడు తన ఔదార్యాన్ని చాటుకున్నాడు. భిక్షం ఎత్తుకున్న డబ్బుతోనే ప్రజాసేవకు పూనుకున్నాడు. నిరాశ్రయులకు దుప్పట్లు కొని దానంగా ఇస్తున్నాడు.
పంజాబ్‌లోని పఠాన్‌కోట్‌కు చెందిన రాజు (Beggar Raju) అనే వ్యక్తి వీధుల్లో భిక్షం ఎత్తుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. అయితే, ప్రస్తుతం శీతాకాలం కావడంతో చలి తీవ్రత పెరిగింది. చలి గాలులకు వీధుల్లో తిరగడం చాలా కష్టంగా మారింది. ఆ పరిస్థితిని ప్రత్యక్షంగా అనుభవిస్తున్న అతడు.. ఈ వింటర్ సీజన్‌లో నిరాశ్రయుల గురించి ఆలోచించి చలించిపోయాడు. వారి కోసం ఏదో ఒకటి చేయాలనుకున్నాడు. తాను భిక్షం ఎత్తుకోగా వచ్చిన డబ్బుతో 500 దుప్పట్లు కొన్నాడు. వాటిని రోడ్డు పక్కన, ఫుట్‌పాత్‌పై పడుకునేవారికి, నిరాశ్రయులకు దానం చేశాడు. అతిశీతల ఉష్ణోగ్రతలతో ఇబ్బందిపడుతున్న వారిని ఆదుకోవాలన్న తపనతో బ్లాంకెట్ లంగర్‌ను ఏర్పాటు చేశాడు. తన వద్ద ఉన్నదాంట్లోనే ఇతరులకు సాయం చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నాడు. అతని నిస్వార్థ సేవ స్థానికులను గుండెల్ని కదిలిస్తోంది.
ఇవి కూడా చదవండి :
Elderly Couple | తొలిసారి సముద్రాన్ని చూసి పరవశించిన వృద్ధజంట.. హృదయాన్ని హత్తుకునే వీడియో
Shalini Pandey | పొట్టి గౌన్ లో షాలిని పాండే కిర్రాక్ పోజులు
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram