Elderly Couple | తొలిసారి సముద్రాన్ని చూసి పరవశించిన వృద్ధజంట.. హృదయాన్ని హత్తుకునే వీడియో

జీవితంలో తొలిసారి సముద్రాన్ని చూసిన వృద్ధ జంట ఆనందం నెటిజన్లను కదిలిస్తోంది. బీచ్‌లో వారి పరవశం వైరల్‌గా మారింది.

Elderly Couple | తొలిసారి సముద్రాన్ని చూసి పరవశించిన వృద్ధజంట.. హృదయాన్ని హత్తుకునే వీడియో

Elderly Couple | సోషల్‌ మీడియా పుణ్యమా అని ప్రపంచంలో ఎక్కడ ఏం జరిగినా క్షణాల్లో మనకు తెలిసిపోతోంది. ఎన్నో వింతలు, వినోదాలు నెటిజన్లను ఆకర్షిస్తున్నాయి. అందులో కొన్ని మనసుకు
హత్తుకునేవి కాగా, స్ఫూర్తినిచ్చేవిగా ఉంటాయి. తాజాగా ఓ వృద్ధ జంట (Elderly Couple)కు సంబంధించిన వీడియో నెటిజన్లను విశేషంగా ఆకట్టుకుంటోంది.

సూర్యాస్తమయాలను చూసేందుకు, సరదాగా టైమ్‌ స్పెండ్‌ చేసేందుకు యువ జంటలు తరచుగా బీచ్‌ (Beach)లకు వెళ్తుండటం మనం సాధారణంగా చూస్తుంటాం. అయితే, ఏండ్ల తరబడి పల్లెకే పరిమితమైన వృద్ధ జంట హఠాత్తుగా బీచ్‌లో ప్రత్యక్షమైంది. ఆ వాతావరణం చూసి వారు పరవశించిపోయారు. జీవితంలో మొదటిసారి సముద్రాన్ని చూసిన ఆనందం వారి కండ్లల్లో కనిపించింది. ఇద్దరూ ఒకరి చేయి ఒకరు పట్టుకుని కనుచూపు మేర విస్తరించిన బీచ్‌ అందాలను చూస్తూ ఓ కొత్త అనుభూతిని పొందారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్‌ అవుతోంది. అలల తాకిడికి ఆ జంట పొందిన పరవశం నెటిజన్లను విశేషంగా ఆకట్టుకుంటోంది. ఆ వృద్ధ జంట ఆనందాన్ని ఈ వీడియోలో మీరూ చూసేయండి మరి..

ఇవి కూడా చదవండి :

SuperShe Island | ఈ ఐలాండ్ అమ్మాయిలకు మాత్రమే.. ఎందుకంటే?.. అబ్బాయిలు వెళ్తే ఇక అంతే!
Ayodhya | అయోధ్య‌.. ఆ 15 కిలోమీట‌ర్ల ప‌రిధిలో మాంసాహారం నిషేధం..!