Whale | తీరానికి కొట్టుకొచ్చిన భారీ తిమింగలం.. ఏకంగా 30 ట‌న్నులు

Whale విధాత: ప్ర‌మాద‌వ‌శాత్తు స‌ముద్ర‌తీరానికి కొట్టుకొచ్చిన ఓ భారీ తిమింగ‌లం ప్రాణాల‌తో పోరాడి మృత్యువాత ప‌డిన ఘ‌ట‌న ఇంగ్లండ్‌లో చోటు చేసుకుంది. ఏకంగా 30 ట‌న్నుల‌ బరువు, 55 అడుగుల పొడవున్న ఈ భారీ జీవి క‌ళేబ‌రాన్ని తొల‌గించ‌డానికి అధికారులు నానాపాట్లు ప‌డ్డారు. ఈ తొల‌గింపు కార్య‌క్ర‌మాన్ని ఇప్ప‌టి వ‌ర‌కు జ‌రిగిన వాటిల్లో అతిపెద్ద‌దిగా 'గార్డియ‌న్' అభివ‌ర్ణించింది. అంతకుముందు ఒడ్డున ప‌డిపోయిన తిమింగళం స‌ముద్రంలోకి వెళ్లిపోడానికి విశ్వ‌ప్ర‌య‌త్నం చేసింది. ఆఖ‌రికి విఫ‌ల‌మై గిల‌గిలా కొట్టుకుంటూ ప్రాణాలు కోల్పోయింది. […]

  • By: krs    latest    May 08, 2023 4:57 AM IST
Whale | తీరానికి కొట్టుకొచ్చిన భారీ తిమింగలం.. ఏకంగా 30 ట‌న్నులు

Whale

విధాత: ప్ర‌మాద‌వ‌శాత్తు స‌ముద్ర‌తీరానికి కొట్టుకొచ్చిన ఓ భారీ తిమింగ‌లం ప్రాణాల‌తో పోరాడి మృత్యువాత ప‌డిన ఘ‌ట‌న ఇంగ్లండ్‌లో చోటు చేసుకుంది. ఏకంగా 30 ట‌న్నుల‌ బరువు, 55 అడుగుల పొడవున్న ఈ
భారీ జీవి క‌ళేబ‌రాన్ని తొల‌గించ‌డానికి అధికారులు నానాపాట్లు ప‌డ్డారు.

ఈ తొల‌గింపు కార్య‌క్ర‌మాన్ని ఇప్ప‌టి వ‌ర‌కు జ‌రిగిన వాటిల్లో అతిపెద్ద‌దిగా ‘గార్డియ‌న్’ అభివ‌ర్ణించింది. అంతకుముందు ఒడ్డున ప‌డిపోయిన తిమింగళం స‌ముద్రంలోకి వెళ్లిపోడానికి విశ్వ‌ప్ర‌య‌త్నం చేసింది.

ఆఖ‌రికి విఫ‌ల‌మై గిల‌గిలా కొట్టుకుంటూ ప్రాణాలు కోల్పోయింది. ఈ వీడియో ఇంట‌ర్నెట్‌లో వైర‌ల్ కావ‌డంతో పెద్ద ఎత్తున సంద‌ర్శ‌కులు బీచ్‌కు చేరుకోవ‌డం మొద‌లు పెట్టారు. ఘ‌ట‌న జ‌రిగిన మంగ‌ళ‌వారం నుంచి తిమింగ‌ళం క‌ళేబ‌రంతో సెల్ఫీలు తీసుకోవ‌డానికి పెద్ద‌ ఎత్తున తరలివచ్చారు.

ఆఖ‌రికి దాని శ‌రీర భాగాలు ఎవ‌రూ దొంగ‌లించ‌కుండా ఉండ‌డానికి కాప‌లా ఉండాల్సి వ‌చ్చింది. ఒక రోజు అనంత‌రం దానిని అతి క‌ష్టం మీద అక్క‌డి నుంచి తొల‌గించారు. ఈ వార్త తాజాగా బయటకు వచ్చింది.