Guntur chilli drone video| సోషల్ మీడియాను షేక్ చేస్తున్న గుంటూరు కారం!
సోషల్ మీడియాను గుంటూరు కారం షేక్ చేస్తుంది. గుంటూరు మిర్చికి ప్రపంచ వ్యాప్తంగా ఫేమస్. కేవలం కారంతోనే కాదు..పంట దిగుబడుల డ్రోన్ వీడియోలతోనూ కూడా గుంటూరు మిరప వైరల్ గా మారింది.
విధాత : సోషల్ మీడియాను గుంటూరు కారం షేక్ చేస్తుంది. గుంటూరు మిర్చికి ప్రపంచ వ్యాప్తంగా ఫేమస్. కేవలం కారంతోనే కాదు..పంట దిగుబడుల డ్రోన్ వీడియోలతోనూ కూడా గుంటూరు మిరప వైరల్ గా మారింది.
గుంటూరు జిల్లాలోని మిర్చి పొలాల గుండా రైలు వెళ్తున్న డ్రోన్ వీడియో సోషల్ మీడియాలో దూసుకపోతుంది. రైల్వే ట్రాక్ కు ఇరువైపుల గుంటూరు మిరప పంట కోత కోసి ఆరబెట్టారు. ఓ వైపు పచ్చని మిర్చి తోటలు..మరోవైపు ఆరబెట్టిన ఎర్రటి మిర్చి రాశుల మధ్య రైళ్లు ప్రయాణిస్తున్న దృశ్యాలను ఔత్సాహికులు తమ డ్రోన్ కెమెరాతో చిత్రీకరించి సోషల్ మీడియాలో అప్ లోడ్ చేశారు. ఇంకేముంది కనువిందుగా ఉన్న ఆ వీడియోను నెటిజన్లు జోరుగా లైక్ చేస్తున్నారు.
ఆకాశం నుంచి చూస్తుంటే.. భూమి ఎర్రటి మిర్చితో కూడి ఎరుపు రంగు తివాచీని, పచ్చని మిర్చి పంటతో కూడిన పచ్చని రంగు తివాచీని కప్పుకున్నట్లుగా కనువిందు చేస్తేంది. ఆంధ్రప్రదేశ్ గ్రామీణ సౌందర్యాన్ని, మిర్చి రైతుల శ్రమను ప్రతిబింబిస్తున్న ఈ అద్భుత దృశ్యాన్ని మంత్రి లోకేశ్ షేర్ చేయగా, నెటిజన్లు ఫిదా అవుతున్నారు.
There’s something magical about a train slicing through acres of bright red chilli fields. This is a moving postcard from our heartland. This is the spirit of rural #AndhraPradesh pic.twitter.com/oWaOOHOOZX
— Lokesh Nara (@naralokesh) March 3, 2026
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram