Bengaluru | తల్లి ప్రైవేట్ ఫొటోలను బాయ్ ఫ్రెండ్‌కు పంపిన కుమార్తె
బెంగళూరు (Bengaluru)కు చెందిన ఓ యువతి సభ్యసమాజం తలదించుకునే పని చేసింది. ఏకంగా తల్లి ప్రైవేట్ ఫొటోలను బాయ్‌ఫ్రెండ్‌కు షేర్ చేసింది (daughter sends mothers private photos to boyfriend).
Bengaluru | యువత మొబైల్‌ఫోన్‌ను విచ్చల విడిగా వాడుతున్నారు. అవసరానికి మించి ఫోన్‌ను ఉపయోగిస్తున్నారు. చాటింగ్‌లు, రీల్స్ అంటూ ఎక్కువ సమయం ఫోన్‌లోనే గడుపుతున్నారు. ఈ క్రమంలో ఓ యువతి సభ్యసమాజం తలదించుకునే పని చేసింది. ఏకంగా తల్లి ప్రైవేట్ ఫొటోలను బాయ్‌ఫ్రెండ్‌కు షేర్ చేసింది (daughter sends mothers private photos to boyfriend).
బెంగళూరు (Bengaluru) నగరంలోని బ్యాటరాయణపురలో ఓ ఉమ్మడి కుటుంబం నివసిస్తోంది. కుటుంబంలోని ఓ 23 ఏళ్ల యువతి చదువు, ఉద్యోగ పనుల నిమిత్తం తనకు మొబైల్ ఫోన్ కావాలని తల్లిదండ్రులను కోరింది. దీంతో ఆమె కోరిక మేరకు తల్లిదండ్రులు తమ కుమార్తెకు మొబైల్ ఫోన్ కొనిపెట్టారు. ఇక ఫోన్ చేతికి రావడంతో ఆ యువతి సోషల్ మీడియా ఉపయోగించడం మొదలు పెట్టింది. ఈ క్రమంలో ఆమెకు ఓ యువకుడితో పరిచయం ఏర్పడింది. రోజూ చాటింగ్‌లు చేసుకునేవారు. అలా ఫోన్ కాల్స్ మాట్లాడుకునే వరకూ వచ్చింది వారి వ్యవహారం. ఓ రోజు ఆ యువతి బెడ్‌రూమ్‌లో రహస్యంగా ఫోన్ మాట్లాడుతుండగా.. అదే సమయంలో అక్కడికి తల్లి వచ్చింది. దీంతో యువతి ఫోన్ పెట్టేసింది. అనుమానం వచ్చిన తల్లి.. కుమార్తె ఫోన్ తీసుకుని చెక్ చేయగా షాకింగ్ విషయం బయటపడింది.
తల్లి నిద్రిస్తున్నప్పుడు ఆమె ప్రైవేట్ పార్ట్స్‌ను రహస్యంగా ఫొటోలు తీసింది. అంతేకాదు ఇంట్లో తన పిన్ని స్నానం చేస్తుండగా ఎవరికీ అనుమానం రాకుండా వీడియో తీసి ఆ యువకుడికి షేర్ చేసింది. ఈ విషయం తెలుసుకున్న తల్లి ఒక్కసారిగా షాక్ అయ్యింది. వెంటనే తన భర్తకు చెప్పింది. ఇద్దరూ కలిసి కుమార్తెను ప్రశ్నించగా.. యువకుడి ఒత్తిడి మేరకే పంపినట్లు సమాధానం ఇచ్చింది. దీంతో యువతిని మందలించిన తల్లిదండ్రులు.. ఆమె ఫోన్‌లోని ఫొటోలు, వీడియోలు డిలీట్ చేశారు.
అయితే, అప్పటికే ఆ ఫొటోలు, వీడియోలు బాయ్‌ఫ్రెండ్‌కు షేర్ చేసి ఉండటంతో.. దీనిపై వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు యువతీ, యువకుడి ఫోన్లను స్వాధీనం చేసుకొని సీజ్ చేశారు. ఈ మేరకు ఘటనపై దర్యాప్తు చేపట్టారు. ఈ వ్యవహారం స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది. ఈ వార్త తెలుసుకున్న పలువురు.. యువతి చేసిన పనికి మండిపడుతున్నారు.
ఇవి కూడా చదవండి :
Cancer Treatment | క్యాన్సర్ చికిత్సలో విప్లవం.. లుకేమియాకు చికిత్స సాధ్యమే!
Bank employee | నేను ఠాకూర్‌ను.. నాతో పెట్టుకోకు.. కస్టమర్‌కు బ్యాంకు ఉద్యోగిని మాస్ వార్నింగ్
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram