Bank employee | నేను ఠాకూర్‌ను.. నాతో పెట్టుకోకు.. కస్టమర్‌కు బ్యాంకు ఉద్యోగిని మాస్ వార్నింగ్
ఓ కస్టమర్ పట్ల హెచ్‌డీఎఫ్‌సీ (HDFC Bank) బ్యాంకు ఉద్యోగిని (Bank employee) అహంకారపూరితంగా వ్యవహరించింది. "నేను ఠాకూర్‌ను. నాతో పెట్టుకోవద్దు" (I am Thakur Dont mess with me) అంటూ కస్టమర్‌కు మాస్ వార్నింగ్ ఇచ్చింది. అంతటితో ఆగని ఆమె కస్టమర్‌ను ల్యాప్‌టాప్‌తో కొట్టేందుకు కూడా ప్రయత్నించింది.
Bank employee | పని నిమిత్తం బ్యాంకుకు వచ్చే కస్టమర్ల పట్ల ఉద్యోగులు (Bank employee) మర్యాదపూర్వకంగా వ్యవహరించాలి. లేదంటే ఆ బ్యాంకుకే తీవ్ర నష్టం వాటిల్లితుంది. బ్యాంకు ప్రతిష్ట దెబ్బతింటుంది. అయితే, కొందరు ఉద్యోగులు.. కస్టమర్ల పట్ల అహంకారపూరితంగా వ్యవహరిస్తున్నారు. తాజాగా ఓ కస్టమర్‌కు మహిళా ఉద్యోగి మాస్ వార్నింగ్ ఇచ్చిన ఘటన నెట్టింట చర్చకు దారితీస్తోంది.
నాతో పెట్టుకోవద్దు..
ఉత్తరప్రదేశ్ కాన్పూర్ (Kanpur)లోని హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకుకు (HDFC Bank) ఓ కస్టమర్ వెళ్లాడు. అక్కడ మహిళా ఉద్యోగి ఆస్థాతో కస్టమర్‌కు వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ క్రమంలో సహనం కోల్పోయిన ఉద్యోగిని హద్దులుదాటి అనకూడని మాటలు అనింది. అసభ్యకరమైన పదజాలంతో దూషిస్తూ. కులాన్ని ప్రస్తావించింది. “నేను ఠాకూర్‌ను. నాతో పెట్టుకోవద్దు” (I am Thakur Dont mess with me) అంటూ కస్టమర్‌కు మాస్ వార్నింగ్ ఇచ్చింది. అంతటితో ఆగని ఆమె కస్టమర్‌ను ల్యాప్‌టాప్‌తో కొట్టేందుకు కూడా ప్రయత్నించింది. సిబ్బంది, కస్టమర్లు ఉండగానే ఆమె తన విశ్వరూపం చూపించింది. ఈ ఘటనను అక్కడే ఉన్న కొందరు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో అది కాస్తా వైరల్‌గా మారింది.
నెటిజన్లు ఫైర్
వీడియో చూసిన వారంతా ఉద్యోగిని ప్రవర్తపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పబ్లిక్ సర్వీస్ సెక్టార్‌లో పనిచేస్తూ.. కస్టమర్ల పట్ల ఇలా అమర్యాదకరంగా ప్రవర్తించడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. కస్టమర్ల పట్ల మర్యాదపూర్వకంగా వ్యవహరించడం కూడా తెలియదా అంటూ మండిపడుతున్నారు. ఇలాంటి ఉద్యోగుల వల్ల బ్యాంకు ప్రతిష్ట దెబ్బతింటుందని, ఆమెపై తక్షణమే చర్యలు తీసుకోవాలంటూ పలువురు డిమాండ్ చేస్తున్నారు. ఈ వీడియోకి హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకును ట్యాగ్ చేస్తూ నెటిజన్లు వైరల్ చేస్తున్నారు. మరోవైపు తాజా ఘటనపై బ్యాంకు ఇంత వరకూ స్పందిచలేదు.
“Thakur hoon main, 🤡
bakchodi mat karna mere se.” 👹👹Astha Singh, an HDFC employee, flaunted her caste on the bank premises and tried to beat a customer without any shame.
This ‘Manu Ki Naatin’ has only merit of hate. HDFC must kick out this casteist clown now. pic.twitter.com/MVFND1m1y4
— Suraj Kumar Bauddh (@SurajKrBauddh) February 8, 2026
ఇవి కూడా చదవండి :
Chandrababu : గోదావరి పుష్కరాలకు ముందే పోలవరం పూర్తి చేస్తాం
Liquor Shops Close: నేటి నుంచి రెండు రోజుల పాటు వైన్స్ షాపులు బంద్
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram