• Telugu News
  • /Telangana

Liquor Shops Close: నేటి నుంచి రెండు రోజుల పాటు వైన్స్ షాపులు బంద్

తెలంగాణ మున్సిపల్ ఎన్నికల పోలింగ్ దృష్ట్యా ఫిబ్రవరి 9 సాయంత్రం 5 నుంచి 11 సాయంత్రం 5 వరకు 48 గంటలు వైన్స్, బార్లు బంద్. ఫలితాల రోజు కూడా మద్యం విక్రయాల నిషేధం.

Reported by: Tejaswini Nanna | తెలంగాణ‌ | Feb 09, 2026, 1:28 pm IST
Read Time: 3 mins
Liquor Shops Close: నేటి నుంచి రెండు రోజుల పాటు వైన్స్ షాపులు బంద్

విధాత, హైదరాబాద్ : మున్సిపల్ ఎన్నికల పోలింగ్ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
రాష్ట్రవ్యాప్తంగా ఏడు కార్పోరేషన్లు, 116 మున్సిపాల్టీలలో ఈ నెల 11న పోలింగ్ జరుగనుంది. 13న ఫలితాలు వెల్లడిస్తారు. ఈ నేపథ్యంలో మున్సిపల్ ఎన్నికల ప్రచారానికి సోమవారం సాయంత్రం 5గంటలకు తెరపడనుంది. అలాగే పోలింగ్ దృష్ట్యా ఎన్నికలు జరుగుతున్న కార్పోరేషన్లు, మున్సిపాల్టీల పరిధిలో ఫిబ్రవరి 9 సాయంత్రం 5 గంటల నుంచి ఫిబ్రవరి 11 సాయంత్రం 5 గంటల వరకు మొత్తం 48 గంటల పాటు మద్యం విక్రయాలపై నిషేధం అమలులో ఉండనుంది. ఈ మేరకు ఎక్సైజ్ శాఖ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. అదే విధంగా 13వ తేదీన ఫలితాల నేపథ్యంలో వైన్స్, బార్లు మూసివేయనున్నారు.

ఈ నిషేధ కాలంలో వైన్ షాపులు, బార్ అండ్ రెస్టారెంట్లలో మద్యం అమ్మకాలు పూర్తిగా నిలిపివేయనున్నారు. నిబంధనలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు. అలాగే ఎన్నికల సందర్బంగా మద్యం అక్రమ రవాణా, పంపిణీలపై పోలీస్, ఎక్సైజ్ శాఖలు సంయుక్తంగా తనిఖీలు నిర్వహించనున్నాయి.
మద్యం విక్రయాల బంద్ కు ప్రజలు సహకరించాలని, శాంతియుతంగా ఎన్నికలు జరిగేలా సహకారం అందించాలని అధికారులు కోరారు.

ఇవి కూడా చదవండి :

Gold Silver Price Today : షాకింగ్..అకస్మాత్తుగా పెరిగిన బంగారం, వెండి ధరలు!
India Gold Mine | మన దేశంలో అత్యధికంగా బంగారం ఉత్పత్తి చేసే రాష్ట్రం ఇదే! 99 శాతం అక్కడి నుంచే సరఫరా!