Gold Silver Price Today : షాకింగ్..అకస్మాత్తుగా పెరిగిన బంగారం, వెండి ధరలు!

హైదరాబాద్‌లో బంగారం, వెండి ధరలు ఒక్కసారిగా భారీగా పెరిగాయి. 24క్యారెట్ బంగారం రూ.1,58,840కు చేరగా, వెండి కిలో రూ.3లక్షలు దాటింది.

Reported by: Tejaswini Nanna | వాణిజ్యం | Feb 09, 2026, 1:13 pm IST
Read Time: 2 mins
Gold Silver Price Today : షాకింగ్..అకస్మాత్తుగా పెరిగిన బంగారం, వెండి ధరలు!

విధాత, హైదరాబాద్ : బంగారం, వెండి ధరలు గంటల వ్యవధిలోనే విభిన్నంగా స్పందిస్తున్నాయి. సోమవారం ఉదయం స్వల్ప తగ్గుదలతో కొనసాగిన బంగారం, వెండి ధరలు మధ్యాహ్నం కల్లా భారీ పెరుగుదలను నమోదు చేసి కొనుగోలుదారులకు షాక్ ఇచ్చాయి.

సోమవారం హైదరాబాద్ మార్కెట్ లో 24క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ. 2,240పెరిగి..రూ.1,58,840కి చేరింది. 22క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ. 2,050పెరిగి.. రూ.1,45,600వద్ద కొనసాగుతుంది.

కిలో వెండి ధర రూ.15,000పెరిగి.. రూ.3,00000లక్షలకు చేరింది. బంగారం,వెండి ధరల అనూహ్య హెచ్చుతగ్గుదలతో కొనుగోలుదారులు తీవ్ర గందరగోళానికి గురువుతున్నారు. మొత్తం మీద విలువైన లోహాలు బంగారం, వెండి ధరల తగ్గుదల తాత్కాలికమేనని, దీర్ఘకాలంలో వాటి ధరలు బలపడుతాయని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. అయితే వెండి ధర ఆల్ టైమ్ రికార్డు రూ.4,25,000కు తిరిగి చేరుకోవడానికి మరికొంత సమయం పట్టేలా కనిపిస్తుంది.

ఇవి కూడా చదవండి :

No Confidence Motion Against Om Birla : స్పీకర్ ఓం బిర్లాపై ప్రతిపక్షాల అవిశ్వాసం ?
AP bird flu| ఏపీలో మళ్లీ బర్డ్ ఫ్లూ కలకలం..28వేల కోళ్ల మృతి