విధాత: ఒడిశా-ఛత్తీస్‌గఢ్ సరిహద్దులో పనిచేస్తున్న ఒడిస్సా రాష్ట్ర కమిటీ సభ్యుడు వికాస్ సహా బలంగిర్-బర్‌గఢ్-మహాసముంద్(BBM)డివిజన్‌కు చెందిన 15 మంది సభ్యులు మహాసముంద్ జిల్లాలో అధికారుల ముందు లొంగిపోయారు. స్పెషల్ జోనల్ కమిటీ సభ్యుడు, డివిజన్ చీఫ్ ముప్పిడి సాంబయ్య అలియాస్ వికాస్ తలపై రూ.65 లక్షల బహుమతి ఉంది. లొంగిపోయిన మావోయిస్టులు AK-47 రైఫిళ్లు, రెండు SLRలు, మూడు .303 రైఫిళ్లు, మూడు 12-బోర్ గన్లు, రెండు INSAS రైఫిళ్లు, ఒక 14 మస్కెట్ (303 రైఫిల్)లు పోలీసులకు అందజేశారు. ముప్పిడి సాంబయ్య ప్రస్తుతం ఒడిశా రాష్ట్ర పార్టీ కార్యదర్శిగా ఉన్నారని తెలుస్తుంది. ముప్పిడి సాంబయ్య స్వస్థలం వరంగల్ జిల్లా తరాలపల్లి.
లొంగిపోయిన వారిలో వికాస్ (స్పెషల్ జోనల్ కమిటీ సభ్యుడు), దినేష్ (ప్లాటూన్ సభ్యురాలు), కవిత (ప్లాటూన్ సభ్యురాలు), సవిత (ప్లాటూన్ సభ్యురాలు), మంగేష్ (డివిజనల్ కమిటీ సభ్యుడు – బీబీఎం), రింకు (ఏరియా కమిటీ సభ్యుడు), జుగ్ను (ప్లాటూన్ సభ్యుడు), డివిజన్ కమిటీ మెంబర్ బేబీ, ఏరియా కమిటీ సభ్యులు అస్మిత, సస్మిత, సాస్మిత, రీటా, నీల, మీనాలు ఉన్నారు.
ఛత్తీస్‌గఢ్ హోం మంత్రి విజయ్ శర్మ ఈ సందర్బంగా మావోయిస్టులందరు లొంగిపోవాలని ఒక సందేశాన్ని జారీ చేశారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం వారికి అన్ని రకాల సహాయ, పునరావాసాల ప్రక్రియను అమలు చేస్తామని హమీ ఇచ్చారు.
