Snow Fog | హైదరాబాద్ : హైదరాబాద్ నగరం కశ్మీర్‌ను తలపిస్తోంది. గత రెండు రోజుల నుంచి మంచు విపరీతంగా కురుస్తోంది. నగర శివార్లలో అయితే పొగమంచు దట్టంగా కురియడంతో ప్రజలు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
శనివారం ఉదయం కూడా హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో దట్టమైన పొగ మంచు కురిసింది. ఔటర్ రింగ్ రోడ్డు, ఇతర హైవేలపై ప్రయాణించేవారు జాగ్రత్తగా ఉండాలని అధికారుల సూచించారు. ప్రతి వాహనదారుడు నెమ్మదిగా వెళ్లాలని సూచించారు. రోడ్డు ప్రమాదాలు జరగకుండా చూడాలన్నారు.
అయితే హైదరాబాద్‌తో పాటు రాష్ట్ర వ్యాప్తంగా చలి తగ్గినప్పటికీ.. పొగమంచు మాత్రం దట్టంగా కురుస్తుంది. రానున్న రెండు, మూడు రోజులు మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో నగర ప్రజలతో పాటు వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు.
