UP wedding | కట్నం ఇవ్వలేదనో.. మర్యాదలు సరిగా చేయలేదనో.. నచ్చిన ఆహారం వడ్డించలేదనో.. ఇలా కొన్ని కారణాలతో పెళ్లిళ్లు రద్దవుతుండటం చూస్తుంటాం. కానీ, కుక్క కారణంగా పెళ్లి రద్దు చేసుకోవడం ఎక్కడైనా చూశారా..? ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh)లో అదే జరిగింది (UP wedding). పెళ్లి కూతురు ప్రాణంగా పెంచుకుంటున్న పెంపుడు శునకాన్ని కొట్టారని ఆమె వివాహాన్నే రద్దు చేసుకుంది (grooms family beats up brides pet dog).
ప్రయాగ్‌రాజ్‌కు చెందిన అమ్మాయికి, ఫతేపూర్ (Fatehpur) జిల్లాలోని కొత్వాలి ప్రాంతానికి చెందిన సుమిత్ కేశర్వాణితో వివాహం నిశ్చయమైంది. ఫిబ్రవరి 18, 19 తేదీల్లో వివాహం పెట్టుకున్నారు. దీంతో పెళ్లి కోసం వధువు కుటుంబం బుధవారం రాత్రి కొత్వాలి ప్రాంతంలోని ఓ అతిథి గృహానికి చేరుకుంది. అక్కడ వారికి వరుడి కుటుంబం గ్రాండ్‌గా వెల్‌కమ్ చెప్పింది. రాత్రి ఊరేగింపు పూర్తైంది. మిగతా కార్యక్రమాలు జరుగుతున్నాయి.
తెల్లవారుజామున 4 గంటల ప్రాంతంలో పూజా మందిరం వద్ద ఆభరణాల సమర్పణ కార్యక్రమం జరుగుతోంది. ఆ సమయంలో వధువు కుటుంబ సభ్యులు కొద్ది దూరంలో కట్టేసిన పెంపుడు కుక్క మొరగడం ప్రారంభించింది. దీంతో వరుడి కుటుంబ సభ్యులు ఆ కుక్క అరుపుకు చిరాకు పడ్డారు. దాన్ని దారుణంగా కొట్టారు. ఈ చర్యను వధువు ఫ్యామిలీ తీవ్రంగా వ్యతిరేకించింది. ఈ క్రమంలో ఇరు కుటుంబ సభ్యుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. మాటా మాటా పెరిగి అదికాస్తా తీవ్ర ఘర్షణకు దారి తీసింది. ఒకరిపై ఒకరు చేయిచేసుకునే వరకూ వెళ్లింది. కర్రలు, కుర్చీలతో ఇరు కుటుంబ సభ్యులు దాడి చేసుకున్నారు.
దీంతో అక్కడ ఘర్షణ వాతావరణం నెలకొంది. ఈ ఘర్షణలో పెళ్లి కుమార్తె వైపు బంధువులు గాయపడ్డారు. పరిస్థితి చేయిదాటిపోతుండటంతో అక్కడే ఉన్న కొందరు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు గొడవను ఆపేశారు. క్షతగాత్రులకు స్థానికంగా ఉన్న ఆసుపత్రిలో చికిత్స ఇప్పించారు. అనంతరం వధువు కుటుంబాన్ని ప్రయాగ్‌రాజ్‌కు పంపించేశారు. ఆ తర్వాత విచారణ నిమిత్తం ఇరు కుటుంబాలు పోలసు స్టేషన్‌కు వెళ్లాయి. అక్కడ వధువు తాను వివాహం చేసుకోనని చెప్పేసింది. దీంతో పెళ్లి వేడుకల్లో ఇరు కుటుంబ సభ్యులు ఇచ్చిపుచ్చుకున్న కానుకలను ఎవరివి వారికి ఇచ్చేసుకున్నారు. ఈ వ్యవహారం స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
ఇవి కూడా చదవండి :
Yadadri Brahmostavam : మత్స్యావతార మూర్తిగా అభయమిచ్చిన యాదగిరీషుడు
Music Mapping Neurosurgery : వండర్..గీటార్ వాయిస్తుండగానే బ్రెయిన్ ట్యూమర్ ఆపరేషన్ !
