• Telugu News
  • /Hyderabad

Yadadri Brahmostavam : మత్స్యావతార మూర్తిగా అభయమిచ్చిన యాదగిరీషుడు

యాదాద్రిలో వైభవంగా బ్రహ్మోత్సవాలు: మత్స్యావతారంలో దర్శనమిచ్చిన యాదగిరీషుడు. నేడు శేష వాహన సేవ.. బ్రహ్మోత్సవాల పూర్తి షెడ్యూల్ ఇక్కడ చూడండి.

Reported by: Tejaswini Nanna | హైదరాబాద్​ | Feb 20, 2026, 4:18 pm IST
Read Time: 4 mins
Yadadri Brahmostavam : మత్స్యావతార మూర్తిగా అభయమిచ్చిన యాదగిరీషుడు

విధాత : తెలంగాణ ప్రసిద్ద పుణ్యక్షేత్రం యాదగిరి గుట్ట శ్రీ లక్ష్మీనరసింహ స్వామి ఆలయం వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. బ్రహ్మోత్సవాలలో భాగంగా మూడవ రోజు శుక్రవారం స్వామివారి నిత్య పూజల అనంతరం మత్స్యావతారుడిగా అలంకరించి తిరు మాఢ వీధుల్లో విహరింపచేశారు. వేదాల రక్షణకు స్వామివారు ధరించిన మత్స్వావతారంలో యాదగిరి లక్ష్మీనరసింహుడు తిరు విధుల్లో భక్తులకు దర్శనమిచ్చి అభయమిచ్చారు. స్వామివారిని దర్శించుకున్న భక్తులు గోవింద నామస్మరణలతో పులకించారు. రాత్రి స్వామివారి అలంకార సేవలలో భాగంగా శేష వాహన సేవ నిర్వహించనున్నారు.

ఉత్సవాలలో భాగంగా స్వామివారి అలంకార సేవలు కొనసాగనున్నాయి. అర్చక బృందం నాలుగు వేదాలు, పురాణాలు, ఉపనిషత్తులు, దివ్యప్రబంధ ప్రాశుర పఠనాలను కొనసాగిస్తున్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో భవాని శంకర్, అనువంశిక ధర్మకర్త బీ. నరసింహ మూర్తి, డీఈవో భాస్కర్ శర్మ, ప్రధాన అర్చకులు కండూరి వెంకటాచార్యులు, భట్టర్ సురేంద్రాచార్యులు తదితరులు పాల్గొన్నారు.

ఫిబ్రవరి21 న ఉదయం వటపత్రశాయి అలంకార సేవ, రాత్రి హంస వాహన సేవ, 22న శ్రీ కృష్ణాలంకార సేవ, రాత్రి పొన్న వాహన సేవ, 23న ఉదయం గోవర్ధన గిరి ధారి, సాయంత్రం సింహ వాహన సేవ, 24న జగన్మోహినీ అలంకార సేవ, అశ్వ వాహనం పై రాత్రి ఎదుర్కోలు వేడుక, 25న రాత్రి స్వామివారి తిరుకల్యాణ మహోత్సవం, 26న రాత్రి 8 గంటలకు దివ్వవిమాన రథోత్సవం, 27న స్వామి వారి చక్రతీర్థ స్నానం, 28న గర్భాలయంలోని మూలవరులకు నిర్వహించే సహస్ర ఘటాభిషేకంతో బ్రహ్మోత్సవాలు పరిసమాప్తి కానున్నాయి.

ఇవి కూడా చదవండి :

MLA Raja Singh : ఒవైసీకి ఎమ్మెల్యే రాజాసింగ్ వార్నింగ్
Swiggy Snacc | ప్రారంభించిన ఏడాదికే.. స్నాక్ సేవ‌ల‌కు ముగింపు ప‌లికిన స్విగ్గీ