MLA Raja Singh : ఒవైసీకి ఎమ్మెల్యే రాజాసింగ్ వార్నింగ్

వరంగల్‌లో శివాజీ జయంతి వేడుకల్లో ఎమ్మెల్యే రాజాసింగ్ ఒవైసీ బ్రదర్స్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సెక్యూరిటీ లేకుండా రావాలని సవాల్ విసిరారు.

MLA Raja Singh : ఒవైసీకి ఎమ్మెల్యే రాజాసింగ్ వార్నింగ్

విధాత, హైదరాబాద్ : ఎంఐఎం నేతలు ఒవైసీ బ్రదర్స్ కు బీజేపీ బహిష్కృత గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ మరోసారి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. గతంలో ఓవైసీ తమకు 15 నిమిషాలు సమయం ఇస్తే హిందువులు లేకుండా చేస్తామని అన్నారని, 15 గంటలు.. కాదు… పదిహేను రోజులు కాదు.. పదిహేను సంవత్సరాలు ఇచ్చినా ఒవైసీ బ్రదర్స్ ఏం చేయలేరు అని రాజాసింగ్ అన్నారు. నీకు దమ్ముంటే 5 నిమిషాలు సెక్యూరిటీ లేకుండా వస్తే..నేను కూడా సెక్యురిటీ వదిలేసి వస్తానని, డేట్, టైమ్, ప్లేస్ చెప్పు.. ఎక్కడికి రమ్మంటే అక్కడకు వస్తాను అని రాజాసింగ్ సవాల్ విసిరారు. నాకు కత్తి, గన్ను అససరం లేదని, నా చేతులతోనే చంపేస్తానంటూ ఛాలెంజ్ చేశారు.వరంగల్‌లో జరిగిన ఛత్రపతి శివాజీ జయంతి వేడుకల్లో ఎమ్మెల్యే రాజాసింగ్ ఈ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఎవరు ఎక్కడికి వచ్చినా చేసేదేమీ లేదని తెలుసని, అయినా అవాకులు, చెవాకులు పేలుతూ ముస్లిం ఓట్లను పొందడానికే ప్రయత్నిస్తున్నావంటూ రాజాసింగ్ ఈ వ్యాఖ్యలు చేశారు.

‘శివాజీ నుంచే మోడీ సర్జికల్ స్ట్రైక్స్ నేర్చుకున్నారు

గతంలో భారత్ పై ఉగ్రదాడులు జరిగితే పాకిస్తాన్‌కు ప్రేమలేఖలు రాసేవారని, మీ దేశం టెర్రరిస్టులను మాకు అప్పచెప్పమని కోరేవారని రాజాసింగ్ వ్యాఖ్యానించారు. ఇప్పుడు పాకిస్తాన్ లోకి వెళ్లి ఉగ్రవాదులపై నేరుగా సర్జికల్ స్ట్రైక్స్ చేస్తున్నామని రాజాసింగ్ అన్నారు. శివాజీ మహారాజ్ గెరిల్లా యుద్ధ తంత్రం నుంచే ప్రధాని మోడీ సర్జికల్ స్ట్రైక్స్ స్ఫూర్తి పొందారని ఆయన కొనియాడారు.

ఇవి కూడా చదవండి :

Swiggy Snacc | ప్రారంభించిన ఏడాదికే.. స్నాక్ సేవ‌ల‌కు ముగింపు ప‌లికిన స్విగ్గీ
అసెంబ్లీలో పూలే విగ్రహం పెట్టాలి : కవిత డిమాండ్