అసెంబ్లీలో పూలే విగ్రహం పెట్టాలి : కవిత డిమాండ్
అసెంబ్లీలో పూలే విగ్రహం పెట్టాల్సిందే! ట్యాంక్ బండ్‌పై విగ్రహం ఏర్పాటు పాక్షిక విజయమేనన్న కవిత. కాంగ్రెస్ రూపొందించిన ‘తెలంగాణ తల్లి’ విగ్రహంపై మాజీ ఎమ్మెల్సీ ఘాటు విమర్శలు.
విధాత, హైదరాబాద్ : తెలంగాణ జాగృతి కొన్నాళ్లుగా చేస్తున్న పోరాట ఫలితంతోనే ప్రభుత్వం ట్యాంక్ బండ్ మీద మహాత్మా జ్యోతిభా పూలే విగ్రహం ఏర్పాటు చేస్తుందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత పేర్కొన్నారు.
ట్యాంక్ బండ్ మీద పూలే విగ్రహం ఏర్పాటు చేయడం పాక్షిక విజయమేనన్నారు. పూలే విగ్రహాం అసెంబ్లీలో కూడా ఉండాలన్నది మా డిమాండ్ అని స్పష్టం చేశారు. అలాగే ట్యాంక్ బండ్ మీద పెట్టే పూలే విగ్రహంతో పాటు సావిత్రిభాయి పూలే విగ్రహం కూడా పెడుతున్నారా లేదా అన్నదానిపై ప్రజలకు స్పష్టతనివ్వాలని కవిత డిమాండ్ చేశారు. ప్రొఫెసర్ జయశంకర్ సార్ విగ్రహాన్ని కూడా పెట్టేలా జాగృతి పోరాడుతుందన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం పెడుతున్న బతుకమ్మ లేని తెలంగాణ తల్లి విగ్రహం తెలంగాణ తల్లి ఎన్నటికి కాబోదని కవిత స్పష్టం చేశారు. వాళ్లు పెట్టే కాంగ్రెస్ బొమ్మకు ప్రజల ఆమోదం లభించదని వ్యాఖ్యానించారు. బలవంతంగా ఒక ప్రతీకను ప్రజల మీద రుద్దే ఏ ప్రభుత్వాన్ని ప్రజలు హర్షించబోరు అన్నారు. అధికారం ఉందని వినాశ కాలే విపరీత బుద్ది అన్నట్లు కాంగ్రెస్ వ్యవహరిస్తోందని మండిపడ్డారు.
బీసీ రిజర్వేషన్ల కారణంగానే స్థానిక సంస్థల ఎన్నికల్లో గతంలో కంటే అధిక సంఖ్యలో బీసీలు ప్రజాప్రతినిధులుగా ఎన్నికయ్యారని కవిత తెలిపారు. విద్యా, ఉద్యోగాల్లో కూడా బీసీ రిజర్వేషన్ల బిల్లును అమలు చేయాల్సి ఉందన్నారు. బడ్జెట్ లో బీసీల అభివృద్ధికి కాంగ్రెస్ ఇచ్చిన హామీ మేరకు నిధులు కేటాయించాలని కోరారు.
ఇవి కూడా చదవండి :
Taxi Driver | డబ్బులు అడిగినందుకు.. ట్యాక్సీ డ్రైవర్ చెంప పగలగొట్టిన మహిళ
Mohammad Azharuddin : అజారుద్దీన్ పదవి గండాన్ని…తప్పించే త్యాగశీలి ఎవరో ?
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram