Taxi Driver | డబ్బులు అడిగినందుకు.. ట్యాక్సీ డ్రైవర్ చెంప పగలగొట్టిన మహిళ
సింగపూర్(Singapore)లో భారత సంతతికి చెందిన (Indian-Origin Woman) శాలినీ దేవరాజన్ అనే మహిళ ట్యాక్సీ కిరాయి చెల్లించేందుకు నిరాకరించింది. డ్రైవర్ (Taxi Driver)తో వాగ్వాదానికి దిగింది. ఈ క్రమంలో అతడి చెంప పగలగొట్టింది (Slapping).
Taxi Driver | మనం ఒకచోటు నుంచి మరో చోటికి వెళ్లాలంటూ పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్‌నే ఎక్కువగా ఉపయోగిస్తుంటాం. ప్రస్తుతం చాలా మంది ఉబర్, ఒలా, ర్యాపిడో వంటి ఆన్‌లైన్ సర్వీసుల్లో క్యాబ్‌లు బుక్ చేసుకుని సౌకర్యవంతంగా ప్రయాణాలు సాగిస్తున్నారు. అలా గమ్యస్థానానికి చేరిన తర్వాత సర్వీస్‌కు అని డబ్బును డ్రైవర్ (Taxi Driver)కు చెల్లిస్తాం. కానీ ఓ మహిళ డబ్బు అడిగినందుకు ట్యాక్సీ డ్రైవర్ చెంప పగలగొట్టింది (Slapping).
ఇంతకీ ఏం జరిగిందంటే..?
36 ఏళ్ల శాలినీ దేవరాజన్ (Shalini Devarajan) అనే భారత సంతతికి చెందిన మహిళ (Indian-Origin Woman) సింగపూర్‌లో (Singapore) నివాసం ఉంటోంది. ఆమె ఓ రోజు రాత్రి ఫ్రెండ్స్‌తో కలిసి పార్టీకి వెళ్లింది. అక్కడ ఫుల్‌గా మద్యం సేవించింది. మద్యం మత్తులో ఓ ట్యాక్సీ ఎక్కింది. ఆ తర్వాత అందులో పడుకుంది. ఇక గమ్యస్థానం వచ్చిన తర్వాత 73 ఏళ్ల వయసున్న ట్యాక్సీ డ్రైవర్ శాలినీని నిద్ర లేపాడు. ఆమెను అక్కడికి తీసుకురావడానికి ట్యాక్సీ కిరాయి 24 సింగపూర్ డాలర్లు (SGD) అయ్యింది. దాన్ని చెల్లించాలని అతడు శాలినీకి చెప్పాడు.
అయితే, తన దగ్గర క్యాష్ లేదని, ఆన్‌లైన్‌లో చెల్లించడానికి కూడా డబ్బు లేదని ఇంట్లోకి వెళ్లి తీసుకొస్తాను అని చెప్పింది. అందుకు ట్యాక్సీ డ్రైవర్ ఒప్పుకోలేదు. మీ ఫోన్ ఇక్కడే పెట్టి వెళ్లండి.. డబ్బు తీసుకొచ్చాక ఫోన్ తీసుకోమని చెప్పాడు. అందుకు ఆమె నిరాకరించింది. సరే తానూ ఇంటి దగ్గర వరకూ వస్తానని ట్యాక్సీ డ్రైవర్ చెప్పడంతో అందుకూ ఒప్పుకోలేదు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. మాటామాటా పెరిగింది. ఈ క్రమంలో డబ్బులు ఇచ్చేదే లేదు అంటూ ఆమె తెగేసి చెప్పింది. కావాలంటే పోలీసు స్టేషన్‌కు తీసుకెళ్లు అంటూ వాదించింది.
చేసేదేమీ లేక ఆ డ్రైవర్ ఆమె చెప్పినట్టే చేశాడు. ట్యాక్సీని పోలీసు స్టేషన్‌కు తిప్పాడు. అక్కడ ఆగ్రహంతో ఊగిపోయిన శాలినీ.. పోలీసుల ఎదుటే డ్రైవర్ చెంప పగలగొట్టింది. ఆ దెబ్బకు వృద్ధుడు కిందపడిపోయాడు. దీంతో పోలీసులు అతడిని ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స అనంతరం డిశ్చార్జ్ అయ్యాడు. ఇక ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు శాలినీని అరెస్ట్ చేశారు. కోర్టులో హాజరుపరచగా.. ఆమెకు రెండు వారాల జైలు శిక్ష పడింది. అంతేకాదు, డ్రైవర్ వైద్య ఖర్చుల నిమిత్తం 172 సింగపూర్ డాలర్లు చెల్లించాలని ఆదేశించింది. కాగా, డ్రైవర్‌తో గొడవపడిన సమయంలో శాలినీ వద్ద 50 సింగపూర్ డాలర్లు ఉండటం గమనార్హం. అయినప్పటికీ కిరాయి చెల్లించకుండా వాగ్వాదానికి దిగింది.
ఇవి కూడా చదవండి :
రంజాన్ మాసంలో ఉపవాస దీక్షలు ఎందుకు చేస్తారు?.. దీని వెనుక ఇంత స్టోరీ ఉందా!
Garbage Girl | నేను చెత్తను ఎంచుకోలేదు.. అదే నన్ను ఎంచుకుంది.. ఇండియన్ గార్బేజ్ గర్ల్ స్ఫూర్తిదాయకమైన కథ
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram