విదేశీ పర్యటనల సమయంలో ప్రధాని మోదీకి లభిస్తున్న స్వాగతాలు ఒక్కోసారి ప్రత్యేకంగా నిలుస్తున్నాయి. తాజాగా అస్ట్రేలియా, న్యూజిలాండ్ పర్యటనలకు వెళ్లిన ప్రధాని మోదీకి ఆ దేశాలలో ఘన స్వాగత సత్కరాలు లభించాయి. అయితే న్యూజిలాండ్ లో ప్రధాని మోదీకి లభించిన స్వాగతం వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
న్యూజిలాండ్ మావోరీ తెగకు చెందిన సంప్రదాయ ‘హాకా’ నృత్యంతో ప్రధాని నరేంద్ర మోదీకి ఘన స్వాగతం పలికారు. ఈ స్వాగత ఘట్టంలో సాంప్రదాయ మావోరీ గిరిజన నృత్యంలో అధికారులు సైతం భాగస్వామిగా కనిపిస్తుండటం ఆసక్తి రేపింది. న్యూజిలాండ్ ప్రధాని క్రిస్టోఫర్ లక్సాన్ విమానాశ్రయానికి వచ్చి మోదీకి ఘన స్వాగతం పలికారు. ఇరు దేశాల నేతలు ఆత్మీయ ఆలింగనం చేసుకున్నారు. ఆక్లాండ్‌లో తనకు లభించిన స్వాగత కార్యక్రమ దృశ్యాలను ‘ఎక్స్’లో మోదీ పోస్ట్ చేశారు. ఘన స్వాగతం పలికిన న్యూజిలాండ్ ప్రధాని క్రిస్టోఫర్‌కు మోదీ ధన్యవాదాలు తెలిపారు.
ఆసియా-పసిఫిక్ పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ ఇండోనేషియా, అస్ట్రేలియా, న్యూజిలాండ్ దేశాలలో పర్యటిస్తున్నారు. 40 ఏళ్లలో మోదీ న్యూజిలాండ్‌లో అధికారికంగా పర్యటించడం ఇదే మొదటిసారి. ఆయా దేశాలతో భారత్ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం.. సాంకేతికత, సేవలు, రెండు దేశాల మధ్య రాకపోకలు, పెట్టుబడులు సహా పలు అంశాల్లో మరిన్ని కీలక ఒప్పందాల దిశగా ప్రధాని మోదీ పర్యటనలు కొనసాగాయి.
प्रधानमंत्री मोदी का दुनिया में फिर दिखा जलवा 🇮🇳
माओरी जनजाति के पारंपरिक ‘हाका’ नृत्य के साथ
हुआ PM नरेंद्र मोदी का न्यूज़ीलैंड में भव्य स्वागत pic.twitter.com/xxlmYQbOOe— Amrendra Bahubali 🇮🇳 (@TheBahubali_IND) July 11, 2026