India AI Impact Summit  | గ్లోబల్ ఏఐ సమ్మిట్‌లో గాల్గోటియ యూనివర్సిటీ ఘటన భారత ప్రతిష్ఠకు మచ్చ

గాల్గోటియా పరిణామం కేవలం ఒక యూనివర్సిటీకి సంబంధించిన అంశంగా కాకుండా, భారత ఏఐ పరిశోధనల నైతికత, పారదర్శకతపై ప్రశ్నలను లేవనెత్తింది. గ్లోబల్ సమ్మిట్ లాంటి అంతర్జాతీయ వేదికలపై ప్రదర్శించేది నిజమైన మన దేశ పరిశోధనలకు సంబంధించినవే ప్రదర్శించబడితే బాగుండేది. కానీ ఇతర దేశాలు తయారుచేసిన ఉత్పత్తులను తమవిగా చూపించడం దేశ ప్రతిష్టకు మచ్చను తీసుకురావడమే కాకుండా, బిజెపి ప్రభుత్వ నకిలీ దేశభక్తిని ప్రశ్నిస్తుంది.

galgotias-robot-dog-controversy

India AI Impact Summit  |  న్యూఢిల్లీ వేదికగా ఫిబ్రవరి 16 నుండి 20 వరకు నిర్వహించిన ఆల్ ఇండియా ఏఐ గ్లోబల్ 4వ సమ్మిట్ (India AI Impact Summit 2026) భారతదేశాన్ని కృత్రిమ మేధస్సు రంగంలో ప్రపంచ నాయకత్వ స్థాయికి తీసుకెళ్లే ప్రయత్నంగా ప్రచారం పొందింది. దీనికి జాతీయ అంతర్జాతీయ మీడియాలో పెద్ద ఎత్తున ప్రాచుర్యం దక్కింది. “భద్రమైన, నైతికమైన, మానవకేంద్రిత ఏఐ” అనే నినాదంతో ఈ సమ్మిట్‌ జరిగింది. ఇంతకుముందు మూడు అంతర్జాతీయ సమ్మిట్ లు యూకే, సియోల్, ప్యారిస్ దేశాల్లో జరిగాయి. మొట్టమొదటిసారిగా మన దేశంలో జరిగిన అంతర్జాతీయ ఏఐ సమ్మిట్‌లో ప్రభుత్వాలు, అంతర్జాతీయ సంస్థలు, టెక్ కంపెనీలు, శాస్త్రవేత్తలు, విశ్వవిద్యాలయాలు, పరిశోధన విద్యార్థులు పాల్గొన్నారు. అయితే ఇలాంటి ప్రతిష్టాత్మక వేదికపై చోటు చేసుకున్న గాల్గోటియ యూనివర్సిటీ ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారి తీసింది.

సమ్మిట్‌లో భాగంగా గాల్గోటియ యూనివర్సిటీ తమ స్టాల్‌లో ఒక ఏఐ ఆధారిత రోబోటిక్ డాగ్‌ను ప్రదర్శించింది. మొదట ఇది తమ యూనివర్సిటీ పరిశోధన ఫలితంగానే ఈ రోబోటిక్ డాగ్ ను తయారుచేశామని అది దాని పేరు ఓరియన్ అని గాల్గోటియ యూనివర్సిటీ ప్రతినిధి ప్రకటించింది. కేంద్రమంత్రి అశ్విని వైష్ణవ్ కూడా తన ఎక్స్ ఖాతా ద్వారా ఇదే విషయాన్ని పోస్ట్ చేశాడు. దేశంలో ఉన్న మోడీ అనుకూల చానల్స్ లో విశేష ప్రాచుర్యం పొందడంతో అది చూసిన వాళ్లలో విశేషమైన ఆసక్తి నెలకొల్పింది. కానీ కొద్ది గంటల్లోనే ఆ రోబోట్ వాస్తవానికి చైనా కంపెనీ తయారు చేసిన కమర్షియల్ ఉత్పత్తి అని దాని పేరు యూనిట్రీ అని వెలుగులోకి వచ్చింది. 3 లక్షల డాలర్లు చెల్లిస్తే ఎవరైనా ఆన్లైన్ ద్వారా కొనుగోలు చేయవచ్చు అని తేలింది.

అంతర్జాతీయ వేదిక మీద చైనా దేశ రోబోటిక్ డాగ్ ను తమ యూనివర్సిటీ తయారుచేసిందని గాల్గోటియా యూనివర్సిటీ ప్రకటించి తరువాత నాలుక కర్చుకుని అది కేవలం విద్యార్థుల సందర్శనార్థం మాత్రమే పెట్టిందని తమ సంస్థ తయారు చేయలేదని ప్రకటించింది. దీనికి తమ యూనివర్సిటీలోని ఒక మహిళ అధ్యాపకురాలని బాధ్యుల్ని చేసింది. అంతర్జాతీయ వేదికపై భారత్ పరువు తీసిందని పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో గ్లోబల్ సమ్మిట్ స్టాల్ ను గాల్గోటియా యూనివర్సిటీ అర్ధాంతరంగా ముగించుకుంది. గాల్గోటియా ప్రవేట్ యూనివర్సిటీ ఉత్తరప్రదేశ్ ఢిల్లీ సరిహద్దు ప్రాంతమైన నోయిడాలో ఉంది. ఒక ప్రైవేట్ యూనివర్సిటీ నేడు జాతీయ అంతర్జాతీయ వార్త ఛానల్ లలో తీవ్రమైన వివాదాస్పదం కావడంతో దీనిపై అనేక చర్చలు, సెటైర్లు వస్తున్నాయి.

నరేంద్ర మోడీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ గ్లోబల్ సమ్మిట్ లో ఈ యూనివర్సిటీ చైనా నుండి కొనుగోలు చేసిన రోబోటిక్ డాగ్ ను తమ యూనివర్సిటీ విద్యార్థులు ఏఐ  ఉపయోగించి తయారుచేసినట్టుగా యూనివర్సిటీలో 350 కోట్లతో ఆర్టిఫిషియల్ ఇంటిలిజెంట్ ల్యాబ్ ను స్థాపించినట్టుగా గ్లోబల్ సమ్మిట్ వేదికగా ప్రకటించింది. ఇదంతా ఫేక్ అని తేలడంతో నేడు అనేక చర్చలు, సెటైర్స్ ఈ యూనివర్సిటీపై జరుగుతున్నాయి. కరోనా సమయంలో కూడా ధ్వని తరంగాల ద్వారా కరోనా వైరస్ ను అంతమొందించవచ్చు అని ఈ యూనివర్సిటీ విద్యార్థి పరిశోధన ద్వారా నిరూపితం అయిందని ప్రకటించి నవ్వుల పాలయ్యింది. 2024 లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఈ యూనివర్సిటీ విద్యార్థులను బిజెపి తన ఎన్నికల ప్రచారాన్ని కోసం తీవ్రంగా వాడుకుంది. మరీ ముఖ్యంగా ఈ ప్రైవేట్ యూనివర్సిటీ యాజమాని సునీల్ గల్గోటియా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, బీజేపీతో చాలా సత్సంబంధాలు ఉన్నాయి. అందుకే వీరిపై ఎటువంటి చర్యలు తీసుకోకుండా కేవలం గ్లోబల్ సమ్మిట్ లో స్టాల్ ను ఖాళీ చేయాలని మాత్రమే ఆదేశించారు. బిజెపి కార్పొరేట్ మతోన్మాద విధానాలను వ్యతిరేకిస్తూ ప్రశ్నిస్తున్న దేశ ప్రజలను దేశద్రోహులుగా, టెర్రరిస్టులుగా, ఉగ్రవాదులుగా పాకిస్తాన్ చైనా ఏజెంట్లుగా ముద్రలు వేస్తున్న బిజెపి, కేంద్ర ప్రభుత్వం నేడు అంతర్జాతీయ వేదికపై దేశం పరువు తీసిన గాల్గోటియ యూనివర్సిటీ పై ఏ విధమైన చర్యలు తీసుకోకపోవడం నేడు వీరి కపట దేశభక్తిని ప్రశ్నిస్తుంది.

దేశంలో విద్యా ప్రవేటీకరణ, కార్పొరేటీకరణ,కాషాయీకరణ వేగంగా జరుగుతుంది. దేశంలో ఉన్న ప్రతిష్టాత్మక యూనివర్సిటీలకు నిధులు కేటాయించడం లేదు. టీచింగ్ నాన్ టీచింగ్ పోస్టులను భర్తీ చేయడం లేదు.ఆ యూనివర్సిటీలలో చదువుకునే విద్యార్థులకు ఫెలోషిప్ స్కాలర్షిప్స్ లు ఇవ్వడం లేదు. విద్యార్థుల మెదళ్లను కలుషితం చేసేలా మతోన్మాదాన్ని ప్రేరేపించే సిలబస్ ను తీసుకొస్తున్నారు. మరోవైపు దేశంలో గాల్గోటియా యూనివర్సిటీ లాంటి ప్రైవేట్ యూనివర్సిటీలు విచ్చలవిడిగా పెరిగిపోతున్నాయి. వీటికి తోడు విదేశీ యూనివర్సిటీలు కూడా తీసుకొస్తామని పాలకులు పెద్ద ఎత్తున చెబుతున్నారు. కానీ ప్రభుత్వ యూనివర్సిటీలు పట్టించుకోకపోతే గాల్గోటియ ప్రైవేటు,విదేశీ యూనివర్సిటీలు దేశంలో విచ్చలవిడిగా వస్తే మన దేశ విద్యార్థులకు విద్య దూరమవ్వవడమే కాకుండా అంతర్జాతీయ వేదికల్లో దేశ ప్రతిష్టకు భంగం వాటిల్లుతుందని దానికి ఒక మంచి ఉదాహరణ.

గాల్గోటియా పరిణామం కేవలం ఒక యూనివర్సిటీకి సంబంధించిన అంశంగా కాకుండా, భారత ఏఐ పరిశోధనల నైతికత, పారదర్శకతపై ప్రశ్నలను లేవనెత్తింది. గ్లోబల్ సమ్మిట్ లాంటి అంతర్జాతీయ వేదికలపై ప్రదర్శించేది నిజమైన మన దేశ పరిశోధనలకు సంబంధించినవే ప్రదర్శించబడితే బాగుండేది. కానీ ఇతర దేశాలు తయారుచేసిన ఉత్పత్తులను తమవిగా చూపించడం దేశ ప్రతిష్టకు మచ్చను తీసుకురావడమే కాకుండా, బిజెపి ప్రభుత్వ నకిలీ దేశభక్తిని ప్రశ్నిస్తుంది.

P. మహేష్.
PDSU రాష్ట్ర అధ్యక్షుడు
సెల్: 9700346942

Latest News