అమరావతి-హైదరాబాద్ బుల్లెట్ రైలు: కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్
అమరావతి-హైదరాబాద్ బుల్లెట్ రైలు ప్రాజెక్టుతో 70 నిమిషాల్లో ప్రయాణం సాధ్యమవుతుందని కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. ఏపీకి భారీ రైల్వే ప్రాజెక్టులు ప్రకటించారు.
అమరావతి : అమరావతి నుంచి హైదరాబాద్ కు బులెట్ ట్రైన్ ప్రాజెక్టు త్వరలోనే సాకారం కాబోతోందని, 70 నిమిషాల్లో అమరావతి నుంచి హైదరాబాద్ కు చేరుకునేలా ఈ ప్రాజెక్టు వస్తోంది అని కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. 112 నిముషాల్లో అమరావతి నుంచి చెన్నైకు చేరుకునేలా బులెట్ ట్రైన్ నిర్మాణం చేస్తామని తెలిపారు. బుల్లెట్ రైళ్ల రాకతో దక్షిణాది ముఖ చిత్రం మారబోతుందన్నారు. ఏపీ సీఎం చంద్రబాబుతో కలిసి విశాఖ గూగుల్ క్లౌడ్ ఇండియా ఏఐ హబ్ శంకుస్థాపన అనంతరం ప్రసంగించిన కేంద్ర ఐటీ శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ఏపీలో సౌత్ కోస్ట్ రైల్వే జోన్ లాంటి కీలకమైన విభజన హామీని కేంద్రం నెరవేర్చిందని, 2026 జూన్ 1 తేదీన సౌత్ కోస్ట్ రైల్వే జోన్ ను అధికారికంగా నోటిఫై చేయబోతున్నాం అని ప్రకటించారు. డబుల్ ఇంజన్ బులెట్ ట్రైన్ సర్కార్ ద్వారా ఏపీకి రూ. 10,134 కోట్ల రైల్వే బడ్జెట్ ను కేటాయించాం అని, గతంలో ఉమ్మడి ఏపీకి కేవలం రూ. 886 కోట్లు మాత్రమే బడ్జెట్ ఉండేదని, ప్రస్తుతం రూ.1.06 లక్షల కోట్ల రైల్వే ప్రాజెక్టులు ఏపీని కనెక్ట్ చేస్తూ నిర్మాణంలో ఉన్నాయని వివరించారు. దేశంలోనే తొలిసారి నవ నిర్మాణ్ ప్రాజెక్టు ద్వారా ఏపీలో 74 స్టేషన్లను ఆధునీకరిస్తున్నట్లుగా, 832 ఫ్లైఓవర్లు, అండర్ పాస్ ల నిర్మాణం జరిగాయని, 1039 కిలోమీటర్ల మేర రైల్వే లైన్ నిర్మాణం జరుగుతోందని తెలిపారు.
వంద శాతం రైల్వే ఎలక్ట్రిఫికేషన్ రాష్ట్రంగా ఏపీ
100 శాతం ఎలక్ట్రిఫికేషన్ పూర్తి చేసుకున్న రాష్ట్రంగా ఏపీ నిలచిందని, 16 వందే భారత్ సర్వీసులు ఏపీలో నడుస్తున్నాయని, 22 అమృత్ భారత్ సర్వీసులు కూడా ఏపీ నుంచి నడుస్తున్నాయని కేంద్ర మంత్రి వెల్లడించారు.
రైళ్ల డిజైన్, ఉత్పత్తిలో చాలా జాగ్రత్తలు తీసుకున్నాం.అభివృద్ధిలోనూ, సంక్షేమంలోనూ దక్షిణాది రాష్ట్రాలకు కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం పూర్తి న్యాయం చేస్తుంది. ప్రతిపక్ష పార్టీలు మాత్రం ప్రతీ అంశాన్నీ రాజకీయం చేస్తున్నాయి. కోల్ కోతా నుంచి చెన్నై వరకూ ఉన్న తూర్పు కోస్తా రైల్వే డబుల్ లైన్లను ఫోర్ లైన్లుగా మారుస్తాం. టైనర్, ఫ్రైట్ ట్రైన్లతో పాటు 500 రైళ్లతో ఈ ప్రాంతాన్ని అనుసంధానిస్తాం అని తెలిపారు. రైల్వేలు, హైవేలు, విద్యుత్, పోర్టులు ఇలా అన్ని రంగాల్లోనూ దక్షిణాదికి భారీ పెట్టుబడులు వస్తున్నాయి. మోదీ సర్కారు అన్ని రాష్ట్రాలకు సమాన అవకాశాలు కల్పిస్తుందని స్పష్టం చేశారు.
ఐటీ సేవల రంగంలో లీడర్ గా భారత్
ఐటీ సేవల రంగంలో భారత్ లీడర్ గా ఎదిగిందని, గూగుల్ ఏఐ డేటా సెంటర్ తో విశాఖపట్నం ఇక ఏఐ పట్నంగా మారుతుందని, ప్రధాని మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు విజన్ కు సెల్యూట్ చేస్తున్నానని అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. విజనరీ లీడర్ చంద్రబాబు నాయుడు నిర్మించిన హైదరాబాద్ లో నిర్మించిన సైబర్ టవర్ ఐటీకి ఐకానిక్ గా నిలిచిందన్నారు. విద్య, వైద్యం, ఏరోస్పేస్, లాజిస్టిక్స్, వ్యవసాయం ఇలా వేర్వేరు రంగాల్లో ఏఐ విప్లవం వస్తోంది. గూగుల్ క్లౌడ్ ఇండియా ఏఐ హబ్ ద్వారా విశేషమైన సేవలు అందుతాయని, ఎంఓయూ చేసుకున్న అతి తక్కువ సమయంలో గూగుల్ ఏఐ డేటా హబ్ శంకుస్థాపన జరుగుతోందని అభినందించారు. ఏఐ డేటా సెంటర్ ను ప్రధాని మోదీ చేతుల మీదుగా ప్రారంభించుకునే రోజు దగ్గర్లోనే ఉందన్నారు. గతంలో ఉత్పత్తి రంగంపై భారత్ ముందుకు వెళ్లలేకపోయిందనవ, సెమీ కండక్టర్లు, చిప్, ల్యాప్ టాప్, మొబైల్ ఉత్పత్తుల లాంటి ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తిలో వెనుకబడ్డాం అని, ప్రధాని మోదీ చొరవతో మొబైల్ మాన్యు ఫాక్చరింగ్ రంగంలో ఇప్పుడు ముందడుగు వేశాం అని చెప్పుకొచ్చారు. భారత్ నుంచి ఇప్పుడు మొబైల్ ఫోన్ అత్యధికంగా ఎగుమతి అవుతున్నాయి అని, దేశీయంగా అవసరమైన 50 శాతం ఎలక్ట్రానిక్ పరికరాలను మన దేశంలోనే ఉత్పత్తి చేసుకుంటున్నాం అని, మేజర్ ఎలక్ట్రానిక్స్ డెవలప్మెంట్, డిజైన్ చేసే దేశంగా భారతదేశాన్ని గుర్తించాలని తెలిపారు.
గూగుల్ సర్వర్లు, జీపీయూ, చిప్ లను ఇక్కడే ఉత్పత్తి చేయాలి
సెమీ కండక్టర్ మిషన్ లో భాగంగా ఇప్పటికే వాణిజ్య పరమైన ఉత్పత్తిని ప్రారంభించాం, సెమీ కండక్టర్లు, ఎలక్ట్రానిక్స్ పరికరాల ఉత్పత్తిలో భారత్ ఎంతో ఎదిగిందని, డేటా సెంటర్లకు అవసరమైన సర్వర్లను కూడా దేశంలోనే ఉత్పత్తి చేసేలా టెక్ కంపెనీలకు కృషి చేయాలని అశ్వినీ వైష్ణవ్ సూచించారు. గూగుల్ కూడా తమ సర్వర్లను, జీపీయూ, చిప్ లను ఇక్కడే ఉత్పత్తి చేసేలా చూడాలని, భారతదేశం చేస్తున్న ఈ సూచనను గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ కు కూడా తెలియచేయాలని విజ్ఞప్తి చేస్తున్నామన్నారు. తక్కువ వ్యయంతోనే నాణ్యమైన ఉత్పత్తులు తయారు చేసేందుకు వీలుందని, విశాఖ నుంచి 3 సబ్ సీ కేబుల్స్ ను వేస్తున్నందుకు గూగుల్ కు ధన్యవాదాలు అని, ఆస్ట్రేలియా, మిడిల్ ఈస్ట్ మీదుగా యూరోప్ కు, అఫ్రికా మీదుగా అమెరికాకు వెళ్లేలా ఈ సబ్ సీ కేబుల్స్ వేస్తుండటం అభివృద్దిని వేగవంతం చేస్తుందన్నారు.
ఇవి కూడా చదవండి :
పైలట్ రోహిత్ రెడ్డికి కండీషన్ బెయిల్
మా ఫోన్లు, సీసీ కెమెరాలను హ్యాక్ చేస్తున్నారు : హరీశ్ రావు సంచలన ఆరోపణలు
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram