పశ్చిమాసియా సంక్షోభం వేళ…కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు
పశ్చిమాసియా సంక్షోభం వేళ జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశంలో ఖరీఫ్ పంటల మద్దతు ధరల పెంపు, కోల్ గ్యాసిఫికేషన్, రైల్వే ప్రాజెక్టులు, నాగపూర్ విమానాశ్రయ అభివృద్ధికి కీలక నిర్ణయాలు తీసుకుంది.
న్యూఢిల్లీ : పశ్చిమాసియా సంక్షోభం నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ దేశ ప్రజలకు ఆర్థిక సంక్షోభ హెచ్చరికలు..పొదుపు సూచనలు చేసిన నేపథ్యంలో గురువారం జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశంపై అందరి దృష్టి పడింది. అయితే ఆర్థిక ఆంక్షలు..ధరల పెంపు వంటి నిర్ణయాలు లేనప్పటికి..పలు రంగాలకు సంబంధించి కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. దేశవ్యాప్తంగా ఉన్న రైతాంగానికి తీపి కబురు అందిస్తూ..రాబోయే ఖరీఫ్ సీజన్ కోసం పంటల కనీస మద్దతు ధర పెంపు తో పాటు, మౌలిక సదుపాయాల అభివృద్ధిపై ప్రభుత్వం కీలక ప్రకటనలు చేసింది. కేబినెట్ భేటీలో పశ్చిమాసియా సంక్షోభం, పెరుగుతున్న గ్లోబల్ ఆయిల్ రేట్స్, ఇంధన సంరక్షణ, వర్క్ ఫ్రమ్ హోమ్, ఆన్‌లైన్ క్లాసెస్, బంగారం కొనుగోళ్ల వాయిదాపై చర్చించినట్లు సమాచారం. ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశం నిర్ణయాలను కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్విన్ వైష్ణవ్ వెల్లడించారు.
కేంద్ర కేబినెట్ నిర్ణయాలు
ఖరీఫ్ సీజన్‌లో మద్దతు ధరలకు రూ. 2,60,000 కోట్ల రూపాయల కేటాయింపునకు కేబినెట్ ఆమోదం తెలిపింది. కోల్ గ్యాసిఫికేషన్ పథకానికి రూ.37,500 కోట్ల రూపాయలు కేటాయింపులకు అనుమతి ఇచ్చింది.ఈ ప్రాజెక్టు ద్వారా దిగుమతి ఇంధనాలపై ఆధారాన్ని తగ్గించడంతో పాటు దేశీయ పరిశ్రమలకు మద్దతు లభించనుంది. సర్కేజీ – ధోలేరా మధ్య సెమీ హై స్పీడ్ డబుల్ రైల్వే లైన్ నిర్మాణానికి రూ.20,065 కోట్ల రూపాయల కేటాయింపుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో రైల్వే కనెక్టివిటీ మెరుగుపడి పారిశ్రామిక అభివృద్ధికి ఈ ప్రాజెక్టు కీలకంగా మారనుంది. నాగపూర్ అంతర్జాతీయ విమానాశ్రయం ఆధునికరణకు ఆమోదం తెలిపింది.
ఖరీఫ్ పంటలకు పెంచిన మద్దతు ధరలు
రైతుల ఆదాయాన్ని పెంచడమే లక్ష్యంగా, ఖరీఫ్ పంటల కనీస మద్దతు ధరను కేంద్ర ప్రభుత్వం సవరించింది. పంట పెట్టుబడి ఖర్చుకు అదనంగా 50 శాతం కలిపి కొత్త ధరలను నిర్ణయించారు. సాధారణ వరి రకానికి కనీస మద్దతు ధరను రూ.2,441 గా ఖరారు చేశారు. నాణ్యమైన గ్రేడ్-ఏ రకం వరికి మద్దతు ధరను రూ.2,461 గా నిర్ణయించారు. క్వింటాల్ పొద్దుతిరుగుడు మద్దతు ధరను రూ.622 పెంచి రూ.8,343 గా నిర్ణయించారు. క్వింటాల్ పత్తిపై రూ.557 పెంచి రూ.8,267 మద్దతు ధరగా ప్రకటించారు. క్వింటాల్ నువ్వుల మద్దతు ధరను రూ.500 పెంచి రూ.10,052 గా నిర్ణయించింది. క్వింటాల్ సజ్జల మద్ధతు ధర రూ.2,900గా, క్వింటాల్ రాగుల మద్దతు ధర రూ.5,205గా, క్వింటాల్ మక్కజొన్న మద్దతు ధర రూ.2,410 గా, క్వింటాల్ కందుల మద్దతు ధర రూ.8,450 గా, క్వింటాల్ పెసర్ల మద్దతు ధర రూ.8,780గా, క్వింటాల్ మినుముల మద్దతు ధర రూ.7,800 గా, క్వింటాల్ పల్లీల మద్దతు ధర రూ.7,263గా కేంద్రం ప్రకటించింది.
ఇవి కూడా చదవండి :
I Bomma | టాలీవుడ్‌కు మళ్లీ పైరసీ ముప్పు.. తిరిగి యాక్టివ్ అయిన ‘ఐ బొమ్మ’, ‘బప్పం’ వెబ్‌సైట్లు
సీఎం విజయ్ కీలక నిర్ణయం..ఓఎస్డీగా రాధన్ పండిట్ తొలగింపు
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram