సీఎం విజయ్ కీలక నిర్ణయం..ఓఎస్డీగా రాధన్ పండిట్ తొలగింపు
అసెంబ్లీలో బలపరీక్ష పూర్తైన వెంటనే సీఎం విజయ్ తన ఓఎస్డీగా నియమించిన జ్యోతిష్కుడు రాధన్ పండిట్ వెట్రివెల్‌ను తొలగిస్తూ కీలక నిర్ణయం తీసుకున్నారు.
తమిళనాడు సీఎం సీజే.విజయ్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. బుధవారం అసెంబ్లీలో బలపరీక్ష పూర్తయిన వెంటనే తన ఓఎస్డీగా ప్రముఖ జ్యోతిష్కుడు రికీ రాధన్ పండిట్ వెట్రివెల్ నియమకాన్ని రద్దు చేశారు. ఈ మేరకు విజయ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
ప్రముఖ జ్యోతిష్కుడు రికీ రాధన్ పండిట్ వెట్రివెల్ నియమాకాన్ని విజయ్ కి మద్దతునిస్తున్న వీసీకే, వామపక్షాలతో పాటు ప్రతిపక్షం డీఎండీకే తప్పబట్టింది. అసెంబ్లీలో బలపరీక్ష సందర్బంగా సైతం టీవీకే ఎమ్మెల్యే వన్ని అరసు, డీఎండీకే ఎమ్మెల్యే ప్రేమలతలు విజయ్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. వన్నిఅరసు మాట్లాడుతూ ప్రభుత్వానికి మద్దతునిస్తున్నామంటే అన్నింటికి తలూపడం కాదంటూ హెచ్చరించారు. విజ్ఞానాన్ని పెంపొందించే పథకాలకు ప్రాముఖ్యత ఇవ్వాలని, జ్యోతిష్కులకు కాదని చురకలేశారు. విజ్ఞానదాయకమైన మానవత్వం, తెలివితేటలతో వేసే ముందడుగు ప్రతి పౌరుడికి చెందుతుందని అంశంతో ఇండియన్ పీనల్ కోడ్ 51 ఏ రాసిందని గుర్తు చేవారు. మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా చట్టాన్ని తీసుకురావాలని వీసీకే తరఫున గట్టిగా చెబుతున్నాం అన్నారు.
డీఎండీకే పార్టీ ఏకైక ఎమ్మెల్యే, ఆ పార్టీ జనరల్ సెక్రటరీ ప్రేమలతా విజయ్‌కాంత్ సైతం బలపరీక్ష చర్చలో మాట్లాడుతూ ఒక జ్యోతిష్యుడిని ఓఎస్డీగా నియమించుకుని యువతకు ఏం సందేశం ఇస్తున్నారు? అని విజయ్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. జ్యోతిష్యుడి కావాలనుకుంటే వ్యక్తిగతం వరకే, ఇంటికే పరిమితం చేయాలన్నారు. విజయ్ నిర్ణయానికి వ్యతిరేకిస్తూ ఎన్డీయే కూటమిలోని బీజేపీ, పీఎంకేతో కలిసి ఆమె వాకౌట్ చేశారు. ఈ నేపథ్యంలో సీఎం విజయ్ అసెంబ్లీలో బలపరీక్ష పూర్తికాగానే సీఎం ఓఎస్డీగా రికీ రాధన్ పండిట్ వెట్రివెల్ నియమాకాన్ని రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. తద్వారా ఆయన మిత్రపక్షాలు, విపక్షాల సూచనలను గౌరవిస్తున్నట్లుగా ప్రకటించుకున్నారని టీవీకే పేర్కొంది.
ఇవి కూడా చదవండి :
బలపరీక్షలో నెగ్గిన సీఎం విజయ్
Vijay | తమిళ రాజకీయాల్లో కొత్త ట్రెండ్.. సంప్రదాయానికి భిన్నంగా సీఎం విజయ్ డ్రెస్ స్టైల్, సీక్రెట్ ఏంటి?
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram