గుజరాత్ : గాంధీ నగర్ జిల్లా (Gandhi Nagar District) మానస తాలుకా పరిధిలోని లక్రోడా గ్రామానికి చెందిన జేనాజి మక్వానా(65) వృత్తిరీత్యా రైతు. ఆయన గత కొద్ది రోజుల నుంచి తీవ్రమైన కడుపునొప్పి( Stomach ache ) తో బాధపడుతున్నాడు. దీంతో అతన్ని కుటుంబ సభ్యులు మానసలోని ప్రభుత్వ ఆస్పత్రి( Govt Hospital )కి తరలించారు. కడుపు నొప్పికి మెడిసిన్ ఇవ్వడంతో కాస్త ఉపశమనం కలిగింది.
కానీ మళ్లీ కొద్ది రోజులకు కడుపులో తీవ్రమైన నొప్పి వచ్చింది. చేసేదేమీ లేక హిమ్మత్‌నగర్ సివిల్ హాస్పిటల్ (Himmatnagar Civil Hospital)కు తరలించారు. అక్కడ వైద్యులు అతనికి వైద్య పరీక్షలు నిర్వహించారు. సీటీ స్కాన్స్ (CT Scans), సోనోగ్రఫీ (Sonography), ఎక్స్‌రే (X Ray)తో పాటు ఇతర టెస్టులు నిర్వహించారు. అతని కడుపులో ఓ పుల్ల ఉన్నట్లు గుర్తించారు. దీంతో అతనికి అత్యవసరంగా శస్త్ర చికిత్స చేయాలని వైద్యులు నిర్ణయించారు.
మక్వానాకు గంట పాటు సర్జరీ నిర్వహించారు. అతని కడుపులో ఉన్న పుల్లను బయటకు తీశారు. అది వేప పుల్ల అని, 15 సెంటిమీటర్ల పొడవు ఉందని వైద్యులు తెలిపారు. అయితే రైతు కడుపులోకి ఆ వేప పుల్ల ఎలా వెళ్లిందనే విషయం మాత్రం తెలియరాలేదు. ప్రస్తుతం బాధిత రైతు ఐసీయూ( ICU )లో ఉన్నారని, కోలుకుంటున్నారని వైద్యులు పేర్కొన్నారు. త్వరలోనే మక్వానాను డిశ్చార్జి చేస్తామని చెప్పారు డాక్టర్లు.