Site icon vidhaatha

Guvvala Balaraju| తెలంగాణ బీజేపీ చీఫ్ రామచందర్ రావుతో మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు భేటీ

విధాత, హైదరాబాద్ : బీఆర్ఎస్(BRS) మాజీ ఎమ్మెల్యే(Ex Mla) గువ్వల బాలరాజు(Guvvala Balaraju) శుక్రవారం తెలంగాణ బీజేపీ(Telangana BJP) చీఫ్ రామచందర్ రావు(Ramachander Rao)తో భేటీ అయ్యారు. తార్నాకలోని నివాసంలో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పార్టీలో చేరికల ప్రక్రియపై వారివురు చర్చించారు. అనంతరం రామచందర్ రావు మాట్లాడుతూ రెండు మూడు రోజుల్లో గువ్వల తన అనుచరులతో కలిసి బీజేపీలో చేరునున్నారని(Joining in BJP) ప్రకటించారు. నియోజకవర్గ, జిల్లా ప్రజలు, కార్యకర్తలతో చర్చించాకే బాలరాజు ఈ నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. ఇటీవలే గువ్వల బాలరాజు బీఆర్ఎస్ కి రాజీనామా చేశారు. ఆయన ఏ పార్టీలో చేరుతారన్న సస్పెన్స్ కు తెరదించుతూ ఈ రోజు బీజేపీ అధ్యక్షుడు రామచందర్ రావుతో భేటీ అనంతం..ఈ నెల 11న బీజేపీలో చేరేందుకు ముహుర్తం ఖరారు చేసుకున్నారు.

2007 అక్టోబరు 6న బీఆర్‌ఎస్‌లో చేరిన గువ్వల బాలరాజు 2009లో నాగర్‌కర్నూల్‌ లోక్‌సభ స్థానం నుంచి బీఆర్‌ఎస్‌ తరఫున పోటీ చేసి ఓటమి పాలయ్యారు. 2014లో, 2018లో రెండు పర్యాయాలు అచ్చంపేట(ఎస్సీ) నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో అచ్చంపేట నుంచే మూడోసారి పోటీచేసి ఓటమి పాలయ్యారు. బీఆర్ ఎస్ కు రాజీనామా చేసిన బాలరాజు ఆ పార్టీ నాయకత్వం తనను కష్టకాలంలో పట్టించుకోలేదని..ప్రతిపక్ష పాత్ర పోషించడంలోనూ బీఆర్‌ఎస్‌ తీవ్రంగా విఫలమైందంటూ విమర్శలు చేశారు.

Exit mobile version