Real Life Bichagadu | రియ‌ల్ లైఫ్ బిచ్చ‌గాడు.. భార్య కోసం బిక్షాట‌న చేస్తున్న లాయ‌ర్‌

తెలంగాణ‌లో రియ‌ల్ లైఫ్ బిచ్చ‌గాడి (Real Life Bichagadu) గురించి తెగ చ‌ర్చ జ‌రుగుతోంది. లాయ‌రైన కాస‌ర్ల జ‌లంధ‌ర్ రెడ్డి (Kasarla Jalender Reddy) త‌న భార్య ఆరోగ్యం కోసం వేముల‌వాడ రాజ‌న్న ఆల‌యం వ‌ద్ద బిచ్చ‌మెత్తుకుంటూ జీవ‌నం సాగిస్తున్నాడు.

Real Life Bichagadu

Real Life Bichagadu | విజయ్ ఆంటోని హీరోగా తెర‌కెక్కిన ‘బిచ్చగాడు’ (Bichagadu) సినిమా గుర్తుందా..? ఆ మూవీలో త‌న త‌ల్లికోసం విజ‌య్ 48 రోజులు బిచ్చగాడి దీక్ష తీసుకుంటాడు. కోటీశ్వ‌రుడైన అత‌ను వీధుల్లో భిక్షాట‌న చేస్తూ త‌ల్లికోసం త‌ప‌న ప‌డుతుంటాడు. తాజాగా అలాంటి ఘ‌ట‌నే ఓ లాయ‌ర్ నిజ జీవితంలో చోటు చేసుకుంది. అయితే, ఇక్క‌డ భార్య కోసం అత‌డు బిచ్చ‌గాడిగా మారాడు. ఆ రియ‌ల్ లైఫ్ బిచ్చ‌గాడి గురించిన క‌న్నీటి గాధ ఇప్పుడు తెలుసుకుందాం.

తెలంగాణ పెద్ద‌ప‌ల్లి జిల్లా మంథ‌నికి చెందిన కాస‌ర్ల జ‌లంధ‌ర్ రెడ్డి (Kasarla Jalender Reddy) వృత్తిరీత్యా ఓ లాయ‌ర్ (Lawyer). అత‌డికి రాజ‌న్న సిరిసిల్ల జిల్లా బోయిన‌ప‌ల్లి మండ‌లం విలాసాగ‌ర్ గ్రామానికి చెందిన శిరీష‌తో 2006లో వివాహమైంది. అయితే, ఇప్ప‌టికీ వీరికి పిల్ల‌లు లేరు. జ‌లంధ‌ర్ క‌రీంన‌గ‌ర్ కోర్టులో అడ్వ‌కేట్‌గా ప్రాక్టీస్ చేస్తుండేవాడు. శిరీష కూడా బీకామ్ వ‌ర‌కూ చ‌దువుకోవ‌డంతో ఓ ప్రైవేట్ సంస్థ‌లో ఉద్యోగం చేసేది. రెండు చేతులా సంపాదిస్తూ ఇద్ద‌రూ ఆర్థికంగా స్థిర‌ప‌డ్డారు. అయితే, క‌రోనా మ‌హ‌మ్మారి వారి జీవితాల‌ను ఛిన్నాబిన్నం చేసింది.

భార్య‌కు అనారోగ్యం..

క‌రోనా త‌ర్వాత వీరు ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వ‌చ్చింది. జ‌లంధ‌ర్‌కు పెద్ద‌గా కేసులు కూడా లేవు. అదే స‌మ‌యంలో భార్య అనారోగ్యం బారిన ప‌డింది. ఆమె వైద్యం కోసం ఎంతో ఖర్చు చేశారు. తిర‌గ‌ని ఆసుప‌త్రి అంటూ లేదు. ఓ వైపు అనారోగ్యం, మ‌రోవైపు పిల్ల‌లు లేర‌న్న బాధ శిరీష‌ను తీవ్రంగా కుంగ‌దీసింది. ఈ క్ర‌మంలో వేముల‌వాడ రాజ‌న్న ఆల‌యం వ‌ద్ద భిచ్చమెత్తుకుంటే ఆరోగ్యం కుదుటపడుతుందని ఎవ‌రో చెప్పడంతో దంప‌తులిద్ద‌రూ అక్క‌డ మెట్ల‌పై భిక్షాట‌న చేస్తూ భ‌క్తులు ఇచ్చే ప్ర‌సాదంతో కడుపు నింపుకుంటున్నారు.

ఈ విష‌యం ఎలా వెలుగులోకి వచ్చిందంటే..?

రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్‌ గరీమా అగ్రవాల్‌ ఆదేశాల మేరకు వేములవాడలో బిచ్చగాళ్లకు కౌన్సిలింగ్ సెషన్స్ నిర్వహించారు జిల్లా సంక్షేమ అధికారి లక్ష్మీరాజం, ఏఎస్పీ చంద్రయ్య. ఆ స‌మ‌యంలోనే ఈ జంట గురించి వెలుగులోకి వ‌చ్చింది. తనకు పెద్దగా ఆస్తులు లేవని, అద్దె ఇంట్లో ఉంటూ అడ్వకేట్ గా ప్రాక్టీస్ చేసేవాడిని అని, తన భార్య ఆరోగ్యం కుదటపడాలని ఆస్పత్రుల చుట్టూ తిరిగి విసిగిపోయాను..అందుకే దేవుడే దిక్కని భావించి ఇలా భిక్షాటన చేస్తున్నాం అని చెప్పారు జలంధర్ రెడ్డి. తమకు ప్రభుత్వం ఏదైనా ఉపాధి చూపించాల‌ని కోరారు. కొత్త జీవితాన్ని ప్రారంభిస్తామ‌న్నారు. దీంతో ప్ర‌స్తుతం ఎక్క‌డ చూసినా ఈ రియ‌ల్ లైఫ్ బిచ్చ‌గాడి గురించే చ‌ర్చ జ‌రుగుతోంది.

ఇవి కూడా చదవండి :

Kavitha : కల్వకుంట్ల కవితకు బిగ్ రిలీఫ్
Rythu Bharosa | మెట్రో రైలెక్కిన రైతు భరోసా నిధులు… ఇప్పట్లో నగదు బదిలీ లేనట్టేనా?

Latest News