Kavitha : కల్వకుంట్ల కవితకు బిగ్ రిలీఫ్
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కవితకు భారీ ఊరట లభించింది. ఆధారాలు లేవని రౌస్ అవెన్యూ కోర్టు పేర్కొంటూ కవితతో పాటు నిందితులపై కేసులు కొట్టివేసింది.
విధాత : ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకున్నది. కేజ్రీవాల్, సిసోడియా, కవితకు కోర్టు క్లీన్ చిట్ ఇచ్చింది.
ఎలాంటి ఆధారాలు లేకుండా వారిని కేసులో ఇరికించారని రౌస్ అవెన్యూ కోర్టు పేర్కొంది. కవితతో పాటు ఈ కేసులో ఉన్న 23 మంది నిందితులు తప్పు చేశారని సాక్షాదారాలు లేవని స్పష్టం కోర్ట్ స్పష్టం చేసింది. వారిపై మోపిన అభియోగాలను కొట్టివేసింది. ఈ మేరకు సిబిఐ ప్రత్యేక కోర్టు జడ్జి జితేందర్ సింగ్ ఉత్తర్వులు జారీ చేశారు.
లిక్కర్ స్కామ్ కేసులో భాగంగా గతంలో దాదాపు ఐదున్నర నెలల పాటు కవిత జైలులో ఉన్నసంగతి తెలిసిందే. . కాగా ఈ కోర్టు తీర్పును సవాలుచేస్తూ సీబీఐ అధికారులు దిల్లీ హైకోర్టును ఆశ్రయించనున్నట్లు తెలుస్తోంది.
ఇవి కూడా చదవండి :
Virosh | విజయ్-రష్మికల విద్యార్హతలపై ఆసక్తికర చర్చ.. ఎవరికెన్ని డిగ్రీలు
Pragya Jaiswal | బీచ్‌లో పరువాల విందు.. బాలయ్య హీరోయిన్ అదిరిపోయే ఫొటోస్
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram