Virosh | విజయ్-రష్మికల విద్యార్హతలపై ఆసక్తికర చర్చ.. ఎవరికెన్ని డిగ్రీలు
Virosh | టాలీవుడ్ మోస్ట్ అడోరబుల్ కపుల్ విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నా ఫిబ్రవరి 26న రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్ ప్యాలెస్ వేదికగా అత్యంత వైభవంగా వివాహ బంధంలో అడుగుపెట్టారు. కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో జరిగిన ఈ వేడుకకు సంబంధించిన ఫోటోలు ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ముహూర్తం ముందు పూజలో పాల్గొన్న విజయ్.. సంప్రదాయానికి ప్రాధాన్యం
Virosh | టాలీవుడ్ మోస్ట్ అడోరబుల్ కపుల్ విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నా ఫిబ్రవరి 26న రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్ ప్యాలెస్ వేదికగా అత్యంత వైభవంగా వివాహ బంధంలో అడుగుపెట్టారు. కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో జరిగిన ఈ వేడుకకు సంబంధించిన ఫోటోలు ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వీరి పెళ్లి సంబరాలు కొనసాగుతుండగానే ఇప్పుడు మరో ఆసక్తికర అంశం నెట్టింట చర్చకు దారితీసింది. అదే వీరిద్దరి విద్యార్హతలు. సినిమాల్లో స్టార్‌డమ్ సాధించిన ఈ జంటలో ఎవరు ఎక్కువగా చదువుకున్నారు? వారి ఎడ్యుకేషన్ బ్యాక్‌గ్రౌండ్ ఏంటి? అనే విషయాలు అభిమానులు తెలుసుకోవాలనే ఆసక్తి చూపుతున్నారు.
రష్మిక మందన్నా విద్యార్హతలు
నేషనల్ క్రష్‌గా గుర్తింపు పొందిన రష్మిక చదువులోనూ ప్రతిభ కనబరిచారు. ఆమె తన పాఠశాల విద్యను కొడగులోని కూర్గ్ పబ్లిక్ స్కూల్‌లో పూర్తి చేశారు. ఉన్నత విద్య కోసం బెంగళూరుకు వెళ్లిన ఆమె, ఎంఎస్ రామయ్య కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్ సైన్స్ అండ్ కామర్స్ లో డిగ్రీ పూర్తి చేశారు. రష్మిక ప్రత్యేకత ఏమిటంటే, ఆమె కేవలం ఒకే సబ్జెక్ట్‌లో కాకుండా సైకాలజీ, జర్నలిజం, ఇంగ్లీష్ లిటరేచర్‌లో ట్రిపుల్ మేజర్ డిగ్రీ పూర్తి చేశారు. విద్యాపరంగా విస్తృత అవగాహన కలిగిన ఆమె, నటిగా మారకముందే అకడమిక్‌గా మంచి ప్రావీణ్యం సంపాదించారు.
విజయ్ దేవరకొండ విద్యార్హతలు
రౌడీ స్టార్ విజయ్ తన పాఠశాల విద్యను అనంతపురం జిల్లా పుట్టపర్తిలోని శ్రీ సత్యసాయి హైయర్ సెకండరీ స్కూల్‌లో బోర్డింగ్ విద్యార్థిగా పూర్తి చేశారు. క్రమశిక్షణతో కూడిన వాతావరణంలో చదువుకున్న ఆయన, అనంతరం హైదరాబాద్‌లోని భద్రుక కాలేజ్ ఆఫ్ కామర్స్ అండ్ ఆర్ట్స్ లో బీకాం (B.Com) డిగ్రీ సాధించారు. చదువు పూర్తయ్యాక తనకు ఉన్న నటన ప్యాషన్‌ను అనుసరించి థియేటర్ ఆర్ట్స్ ద్వారా సినీరంగంలో అడుగుపెట్టారు. క్రమంగా స్టార్ హీరోగా ఎదిగి టాలీవుడ్‌లో ప్రత్యేక స్థానం సంపాదించారు.
ఎవరు ముందున్నారు?
విజయ్, రష్మిక ఇద్దరూ గ్రాడ్యుయేట్లే అయినప్పటికీ, డిగ్రీల పరంగా చూస్తే రష్మిక ట్రిపుల్ మేజర్ పూర్తి చేయడం వల్ల కొంచెం ముందున్నారని అభిమానులు చర్చించుకుంటున్నారు. అయితే విద్య, ప్రతిభ రెండింటిలోనూ ఈ జంట ఒకరికొకరు తగ్గట్టే ఉన్నారు.
మొత్తానికి, టాలెంట్‌తో పాటు విద్యాపరమైన నేపథ్యం కూడా బలంగా ఉండటం ఈ స్టార్ జంటకు మరో ప్రత్యేకతగా నిలిచింది. అభిమానులు ఇప్పుడు వీరి వ్యక్తిగత, వృత్తిపరమైన ప్రయాణాన్ని మరింత ఆసక్తిగా గమనిస్తున్నారు.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram