తెలంగాణలో గత పదేళ్లతో పాటు ఇప్పుడు కూడా కేటీఆర్ పాలనే సాగుతుందని తెలంగాణ రక్షణ సేన(టీఆర్ఎస్) కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. గత బీఆర్ఎస్ హయాంలో కేటీఆర్ అంటే.. కేసీఆర్(KCR), తన్నీరు హారీశ్ రావు(Thaneeru Harish), రామారావు(Rama Rao) అని, ఇప్పుడు కాంగ్రెస పాలనలో కేటీఆర్ అంటే..కొండల్ రెడ్డి(Kondal), తిరుపతి(Tirupati), రేవంత్ రెడ్డి(Revanth Reddy) అని కవిత పేర్కొన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న లక్ష కోట్ల భూ కుంభకోణాలపై కవిత శనివారం మీడియా సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో 1లక్ష కోట్ల ప్రభుత్వ భూములను పెద్దవాళ్లకు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం అప్పగించే ప్రయత్నం చేస్తుందన్నారు. తొలుత హైడ్రాను అడ్డుపెట్టుకుని చేస్తున్న చిన్న భూ దోపిడీ గురించి ఈ రోజు వెల్లడిస్తున్నానని, వరుసగా భూ కుంభకోణాలను ఒక్కొక్కటిగా వెల్లడిస్తానని తెలిపారు. అధికారాన్ని అడ్డంపెట్టుకుని రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యులు, కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు ఏ విధంగా ఈ భూకుంభకోణాల వెనుక ఉన్నారన్న దానిపై సాక్ష్యాలతో వెల్లడిస్తున్నట్లుగా కవిత చెప్పుకొచ్చారు. ప్రభుత్వ పెద్దలు, పెద్ద సంస్ధలు సాగిస్తున్న భూ దోపిడీ నుంచి ప్రభుత్వ భూములను కాపాడి ముందు తరాలకు అందించేందుకు టీఆర్ఎస్ పోరాడుతుందని స్పష్టం చేశారు.
హైడ్రాకు సవాల్
మూసీ నది పరిధిలో భారీ నిర్మాణాలు చేస్తున్న శ్రీ ఆధిత్య బిల్డింగ్ ముందు మేం ధర్నా చేసిన క్రమంలో హైడ్రా మాపై నిందలు వేసే ప్రయత్నం చేసి విఫలమైందని, తర్వాతా మా ఆందోళనను సరైందేనని హైడ్రా గుర్తించినప్పటికి…శ్రీ ఆధిత్య భవన సముదాయ నిర్మాణం పనులు ఆపడం లేదని కవిత విమర్శించారు. 2021లో ప్రేమావతి పేట పెద్ద చెరువు లో బీఆర్ఎస్ హయాంలో అనుమతులతో 2024నాటికి 7ఎకరాల మేరకు కబ్జా జరిగిందన్నారు. దీంట్లో 40ఫోర్ల మేరకు భవంతులు కట్టేందుకు ఓ పెద్ద సంస్థకు అనుమతించారన్నారు. పాత ఊరు నక్ష మొత్తం మార్చేసి ఇక్కడ భూ కుంభకోణానికి పాల్పడుతుందని దీనిపై హైడ్రా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రేమావతి పేట చెరువు ఆక్రమణ చేసిన సంస్థకు కాంగ్రెస్ ప్రభుత్వం మరోచోట కూడా భూములు కట్టబెట్టారని, దాని వివరాలు తర్వాత ఎపిసోడ్ లో వెల్లడిస్తానన్నారు.
నాగారం మున్సిపాల్టీలో ఐకామ్ అనే ఆయుధాలు, బాంబులు తయారు చేసే సంస్థ మేడిబావి, జాలుబావి చెరువులను కబ్జా చేసిందని, రోడ్లు, పార్కులు కబ్జా చేసిందని మున్సిపాల్టీలో తీర్మానం చేసినప్పటికి హైడ్రా ఎందుకు చర్యలు తీసుకోలేదని కవిత ప్రశ్నించారు. దమ్ముంటే హైడ్రా శ్రీ ఆధిత్య, ఐకామ్ సంస్థల భూ కబ్జాలపై చర్యలు తీసుకోవాలని కవిత సవాల్ చేశారు.
పవన్ కోడిచెరువు శిఖం భూములను తిరిగిచ్చేయాలి
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తీసుకున్న సర్వే నెంబర్ 706లోని కోడి చెరువులో శిఖం భూమి ఉందని, తన రిజిస్ట్రేషన్ లో 3ఎకరాలు శిఖం, 7ఎకరాలు మాగాణి అని రాశారని, ఇరిగేషన్ శాఖ రికార్డులో మాత్రం 10ఎకరాలు శిఖం భూమి అని ఉందని, దీనిపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు. పవన్ కల్యాణ్ తను చెప్పినట్లుగా శిఖం భూమిని వాపసు ఇవ్వాలని, అక్రమిత నిర్మాణాలు తొలగించాలని కవిత డిమాండ్ చేశారు. పవన్ కల్యాణ్ ప్రొఫెసర్ నాగేశ్వర్ రావు, కళాకారుడు గద్దర్ లను అవమానించేలా మాట్లాడటం సరికాదన్నారు.
తెలంగాణ ప్రజల టికెట్ సొమ్ముతోనే సినీ నటులు భారీగా సంపాదించుకున్నారన్న సంగతి మరిచి గద్దర్ కు కారు కోనిచ్చానని పవన్ చెప్పడం విడ్డూరంగా ఉందని కవిత విమర్శించారు. తెలంగాణ అంటే దాన్ని ప్రాంతీయ వాద ఉగ్రవాదం అంటున్నారని, మా మేధావులు, కళాకారులను అవమానిస్తున్నారని, మీరు కొనుకునే భూములు, కార్లు కూడా మా తెలంగాణ ప్రజల కొన్న టికెట్ల ద్వారా వచ్చినవే కదా అని, కానీ మీరు గద్దరన్నకు కారు కొనిచ్చానని చెబుతూ ఆయనను అవమానించారంటూ పవన్ పై కవిత మండిపడ్డారు కుడిచేత్తో చేసే దానం ఎడమ చేతికి తెలియనివ్వద్దని అంటారు..కానీ ఎప్పుడో కొని ఇచ్చిన కారు గురించి ఇప్పుడు చెబుతారా అని ప్రశ్నించారు.
తెలంగాణ పవన్ కల్యాణ్ కుటుంబ సభ్యుల జాగీర్ కాదని, ముమ్మాటికి బరాబార్ మా తెలంగాణ ప్రాంత ప్రజల జాగీరు అని కవిత స్పష్టం చేశారు. రాజ్యాంగం మేరకు ఎవరు ఎక్కడైనా పోటీ చేయవచ్చని, అంతేగాని మా ప్రాంతంపై ఆధిపత్యం చలాయిస్తామంటే సహించబోమన్నారు.
ఏపీని 200టీఎంసీల గోదావరి జలాలను అడగాలి
సీఎం రేవంత్ రెడ్డి పాలమూరు ప్రాజెక్టులపై మేం ఆందోళన చేపట్టిన రెండు రోజులకు సమీక్షచేశారని, ఇదే సందర్బంలో గోదావరి నుంచి 200టీఎంసీలను బనకచర్లతో తీసుకపొమ్మని ఏపీకి చెప్పడాన్ని కవిత తప్పబట్టారు. తెలంగాణ అవసరాలకు కృష్ణా నీళ్లు భవిష్యత్తులో సరిపోవని, 968తో పాటు మరో 200టీఎంసీల గోదావరి నీటికి కేంద్రాన్ని అడుగాలని కవిత డిమాండ్ చేశారు. సీఎం రేవంత్ రెడ్డికి ఇరిగేషన్ మీద అవగాహాన తక్కువ ఉందని, మహారాష్ట్ర సీఎం అనుమతించనందునే ఆనాడు కేసీఆర్ తుమ్మిడిహట్టి వద్ద ఎత్తు తగ్గింపుకు అంగీకరించాల్సి వచ్చిందన్నారు. అదంతా పక్కన పెడితే రేవంత్ రెడ్డి చెబితే వినే గురువు ఏపీ సీఎం చంద్రబాబు నుంచి గోదావరి నుంచి 200టీఎంసీలు అడిగి సాధించవచ్చు కదా అని కవిత సూచించారు.
మరోసారి కాంగ్రెస్ ప్రభుత్వ కల్లా…
మరోసారి కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుందని రేవంత్ రెడ్డి చెప్పడం హాస్యాస్పదం అని, అవినీతికి బీఆర్ఎస్ కిటికీలు తెరిస్తే..కాంగ్రెస్ తలుపులు తెరిచిందని, కాంగ్రెస్ ప్రభుత్వం సాగిస్తున్న లక్ష కోట్ల భూదోపిడీని సీరియల్ గా వెలుగులోకి తెచ్చి బయటపెడుతామన్నారు. బీఆర్ఎస్ హయాంలోనే ఫినిక్స్ సంస్థకు 10వేల కోట్ల విలువైన 50ఎకరాలు కట్టబెట్టారని, కాంగ్రెస్ మరో 150ఎకరాలు ఇచ్చేందుకు ప్రయత్నం చేస్తుందని, దీనిని టీఆర్ఎస్ అడ్డుకుంటుందన్నారు. హైడ్రా అనేది పెద్దలకు భూములకు కట్టబెట్టేందుకు రేవంత్ రెడ్డి తెచ్చిందేనన్నారు. మూసీ నది గర్బంలో కడుతున్న శ్రీ ఆధిత్య నిర్మాణాలను ఆపేందుకు టీఆర్ఎస్ అన్ని రకాలుగా పోరాడుతామన్నారు.
ఉద్యమకారులకు భూములు ఇవ్వాల్సిందే..
కేంద్రం పంజాబ్ లో 100శాతం పంటల కొనుగోలు చేస్తున్నప్పుడు తెలంగాణలో ఎందుకు కొనడం లేదో బీజేపీ ఎంపీలు సమాధానం చెప్పాలన్నారు. తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు విషయంలో మా పార్టీతో పాటు తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న పలు పార్టీలు, సంస్థలను పిలువలేదన్నారు. ఉద్యమకారులను గుర్తించి వారికి భూములు ఇవ్వాలని, నాదర్ గూల్ లో ఆక్రమణల పాలవుతున్న 200ఎకరాలు, ఉప్పల్ భగాయత్ భూములను ఉద్యమకారులకు ఇవ్వాలని టీఆర్ఎస్ డిమాండ్ చేస్తుందని,ఇందుకోసం మేం ఉద్యమిస్తామని కవిత స్పష్టం చేశారు.