విద్యాశాఖలో అవకతవకలపై కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలన్న డిమాండ్ తో శనివారం ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద కాక్రోచ్ జనతా పార్టీ ధర్నాకు నిర్వహిస్తుండటంతో దేశ రాజధానిలో టెన్షన్ వాతావరణం నెలకొంది. తాను ఇచ్చిన పిలుపుమేరకు నిరసన కార్యక్రమంలో పాల్గొనేందుకు కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే ఢిల్లీకి చేరుకోవడం, ఆయన పిలుపు మేరకు దేశం నలుమూలల నుంచి వేలాదిగా యువత జంతర్ మంతర్ కు ధర్నాకు హాజరవ్వడంతో పోలీసులు ఆ ప్రాంతంలో భారీగా మోహరించారు.
ఇటీవల నీట్, సీబీఎస్ఈ పరీక్షల లీకేజీ వ్యవహారంలో బాధ్యత వహిస్తూ.. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే తన పదవికి రాజీనామా చేయాలనే డిమాండ్‌తో అభిజీత్ దీప్కే ఈ ధర్నాకు పిలుపునిచ్చారు. అతని పిలుపుమేరకు భారీఎత్తున జెన్-జీ యూత్ భారీ సంఖ్యలో జంతర్ మంతర్ వద్దకు తరలి రావడం కనిపించింది. అటు కాక్రోచ్ పార్టీ నిరసనకు రాజకీయ ప్రముఖుల మద్దతు తెలపడంతో కేంద్రం ఈ ధర్నా వ్యవహారాన్ని సీరియస్ గా తీసుకుంది. ధర్నాకు వచ్చే వాళ్లంతా తమ వెంట పుస్తకాలు, జాతీయ జెండాలు తీసుకురావాలని కోరిన కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే తను చేతిలో అంబేద్కర్ జీవిత చరిత్ర పుస్తకాన్ని పట్టుకుని ఢిల్లీకి చేరుకున్నారు.
ఆయన రాకతో ఎయిర్ పోర్టు నుంచి పోలీసులు భారీగా మోహరించారు. సీజేపీ సభకు పోలీసులు అనుమతి నిరాకరించిన నేపథ్యంలో దీప్కేను అరెస్టు చేసే అవకాశం ఉందని అంతా భావించారు. అయితే చివరి నిమిషంలో పోలీసులు తమ నిర్ణయాన్ని మార్చుకుని ధర్నాకు అనుమతించినట్లుగా అభిజీత్ దీప్కే ప్రకటించారు. సీజేపీ ధర్నా సందర్బంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటుచేశారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన కారుల నినాదలతో జంతర్ మంతర్ వద్ద కాక్రోచ్ పార్టీ ధర్నా కొనసాగుతుంది. ధర్నాకు సంబంధించిన వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
మొదటి గండం గట్టెక్కిన CJP!
జంతర్ మంతర్ వద్ద నిరసన చేయడానికి పోలీసుల నుంచి పర్మిషన్ వచ్చేసింది.
భద్రతా కారణాల వల్ల కొంత సమయం పట్టినా, చివరకు అనుమతి లభించిందని అభిజీత్ దీప్కే ప్రకటించారు.ఈ రోజే ఢిల్లీ చేరుకున్న అభిజీత్ దీప్కే NEET,CBSE వివాదాలపై నిరసనకు కావలసిన అన్ని… pic.twitter.com/wnFejL0PEd
— Ravi Prakash Official (@raviprakash_rtv) June 6, 2026