విశాఖపట్నం : సీఐఐ సదస్సు సందర్భంగా వివిధ సంస్థలతో ఏపీ ప్రభుత్వం ఎంవోయూలు కుదుర్చుకుంటోంది. సదస్సుకు ముందు రోజే పలు సంస్థలతో.. రూ.3.65 లక్షల కోట్ల విలువైన పెట్టుబడులకు ఒప్పందాలు కుదిరాయి. తద్వారా 1.26 లక్షల మందికి ఉద్యోగాలు రానున్నాయి. రూ.62 వేల కోట్లతో రెన్యూ పవర్ సంస్థ ఏర్పాటుకు, రూ.19 వేల కోట్లతో ఈజౌల్ సంస్థ ఏర్పాటుకు, రూ.1200 కోట్లతో తైవాన్ ఇండస్ట్రియల్ పార్కు ఏర్పాటుకు ఎంఓయులు కుదిరాయి. సీఐఐ సదస్సు సందర్భంగా వివిధ సంస్థలతో ఏపీ సర్కార్ కీలక ఒప్పందాలు కుదుర్చుకుంటోంది.
సదస్సుకు ఒక రోజు ముందు జరుగుతున్న ఇండియా-యూరప్ బిజినెస్ అండ్ ఇన్వెస్ట్‌మెంట్ సమ్మిట్ సందర్భంగా భారీ పెట్టుబడులను ఆకర్షించిన ఏపీ ప్రభుత్వం. కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ సదస్సుకు ముందు రోజే 35 సంస్థలతో.. మొత్తం రూ.3.65 లక్షల కోట్ల విలువైన పెట్టుబడులు కుదుర్చుకోవడం గమనార్హం. వీటి ద్వారా 1.26 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలను కల్పిస్తాయని అధికారులు వెల్లడించారు. రెన్యూ పవర్ సంస్థ ఏర్పాటుకు రూ.62వేల కోట్లు, రూ.19 వేల కోట్లతో ఈజౌల్ సంస్థ ఏర్పాటుకు, తైవాన్ ఇండస్ట్రియల్ పార్కు అభివృద్ధికి రూ.1200 కోట్ల పెట్టుబడుల ఎంఓయూలు కుదిరాయి.
అలాగే, రూ.2 వేల కోట్లతో ఫుడ్ ప్రాసెసింగ్, అగ్రి-బిజినెస్‌కు, హీరో ఫ్యూచర్ ఎనర్జీ, రూ.15 వేల కోట్లతో సోలార్ అండ్ విండ్ ఎనర్జీ ప్రాజెక్టులు, రూ.1,500 కోట్లతో ఎనర్జీ స్టోరేజ్ అండ్ టెక్ సొల్యూషన్స్‌కు ఒప్పందాలు కుదిరాయి. ఈ ఒప్పందాలు ఏపీ ఆర్థిక వ్యవస్థకు మరో మైలురాయిగా నిలవనున్నాయి. గురువారం విశాఖలోని నోవాటెల్ హోటల్‌లో జరిగిన సదస్సులో ఏపీ సీఎం చంద్రబాబు పాల్గొని పెట్టుబడిదారులకు హామీలు ఇచ్చారు. ‘సంస్థల ఏర్పాటుకు 45 రోజుల్లోనే అనుమతులిస్తామని.. ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టండి’ అంటూ సీఎం పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా కుదిరిన
మొత్తం 35 ఎంఓయూలలో క్యాపిటల్ రీజన్ డెవలప్‌మెంట్ అథారిటీ 8 ఎంఓయూలు చేసుకుంటోంది.. ఇవి అమరావతి, క్యాపిటల్ రీజన్ అభివృద్ధికి సంబంధించినవిగా ఉన్నాయి. ఇంధన రంగంలో రిఫైనరీలు, పైప్‌లైన్ ప్రాజెక్టులకు సంబంధించినవి 5 ఎంవోయూలు ఉన్నాయి. 4 ఎంఓయూలు ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో అగ్రి-ఎక్స్‌పోర్ట్ హబ్‌ల అభివృద్ధికి ఉపయోగపడనున్నాయి. ఐ అండ్ ఐ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ ఇన్నోవేషన్) రంగంలో 3 ఎంఓయూలు డాటా సెంటర్లు, స్టార్టప్ ఎకోసిస్టమ్‌కు దోహదపడనున్నాయి. ఇతర ఇండస్ట్రీస్ రంగంలో 9 ఎంఓయూలు మాన్యుఫాక్చరింగ్, లాజిస్టిక్స్, టెక్స్‌టైల్స్ అభివృద్ధికి ఉపయోగపడతాయి.