న్యూఢిల్లీ : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ టారీఫ్ టెర్రరిజం కొనసాగిస్తున్నారని..ఈ ఆర్థిక యుద్దాన్ని మూడో ప్రపంచ యుద్దంగా చెప్పవచ్చని పతంజలి సహ వ్యవస్థాపకుడు బాబా రామ్ దేవ్ కీలక విమర్శలు చేశారు. ట్రంప్ టారీఫ్ టెర్రరిజం అత్యంత ప్రమాదకరమైందని, పేద దేశాలపై, వర్ధమాన దేశాలపై సామ్రాజ్యవాద దేశాలు సాగిస్తున్న యుద్దమే టారీఫ్ టెర్రరిజం అని రాందేవ్ ఆరోపించారు. టారీఫ్ పేరుతో సామ్రాజ్యవాద విస్తరణ పోకడలను అనుసరిస్తున్నారని మండిపడ్డారు.
టారీఫ్ టెర్రరిజానికి స్వదేశీ ఉద్యమంతో ఊరట పొందవచ్చని రాందేవ్ చెప్పారు. సామ్రాజ్య వాద విస్తరణ పోకడలతో పోలిస్తే స్వదేశీ ఉద్యమం మెరుగైందన్నారు. సమిష్టిగా దేశాభివృద్ధికి బాటలు వేస్తుందన్నారు. స్వదేశీ అనే నినాదం ఎవరిపైనా ఆధారపడకుండా స్వయంసమృద్ధి సాధించడమేనని అభివర్ణించారు. ప్రపంచంలో శక్తి అతికొద్ది మంది వ్యక్తుల చేతిలోనే కేంద్రీకృతం కావడం మంచిది కాదని బాబా రామ్‌దేవ్ విమర్శించారు. ప్రతి ఒక్కరు తమ హద్దుల్లో ఉండాలని.. సాటి మనిషిని పైకి తీసుకురావాలని పేర్కొన్నారు.
