Site icon vidhaatha

Convicts Love Story | పెరోల్‌పై విడుద‌లై పెళ్లిపీట‌లెక్కి.. హ‌త్య కేసు దోషుల ప్రేమ క‌థ ఇదీ..

Convicts Love Story |

ప్రేమ‌కు, ప్రేమించుకోవ‌డానికి హ‌ద్దులు, స‌రిహ‌ద్దులు లేవు.. ఎప్పుడైనా, ఎక్క‌డైనా ప్రేమించుకోవ‌చ్చు. ఆ మాదిరిగానే ఓ ఇద్ద‌రు దోషులు జైలు గోడ‌ల మ‌ధ్య ప్రేమించుకున్నారు. హ‌త్య కేసులో దోషులుగా తేలిన ఆ ఇద్ద‌రు పెరోల్‌పై విడుద‌లై పెళ్లి చేసుకున్నారు. ఈ ప్రేమ క‌థ గురించి తెలుసుకోవాలంటే ప‌శ్చిమ బెంగాల్ వెళ్లాల్సిందే.

అసోంకు చెందిన అబ్దుల్ హ‌సీం ఓ హ‌త్య కేసులో నిందితుడు. వెస్ట్ బెంగాల్‌కు చెందిన షాహ్నారా ఖ‌తున్ అనే మ‌హిళ కూడా ఓ హ‌త్య కేసులో నిందితురాలు. వేర్వేరుగా జ‌రిగిన ఈ హ‌త్య కేసుల్లో హ‌సీం, ఖ‌తున్ దోషులని కోర్టు తేల్చింది. హ‌సీంకు 8 ఏండ్ల జైలు శిక్ష‌, ఖ‌తున్‌కు 6 ఏండ్ల జైలు శిక్ష విధించింది కోర్టు. దీంతో వీరిద్ద‌రిని బెంగాల్‌లోని బార్ద‌మ‌న్ సెంట్ర‌ల్ క‌రెక్ష‌న‌ల్ హోంకు త‌ర‌లించారు.

జైలు గోడ‌ల మ‌ధ్య చిగురించిన ప్రేమ‌..

ఇక సెంట్ర‌ల్ క‌రెక్ష‌న‌ల్ హోంకు వ‌చ్చిన వీరిద్ద‌రూ రోజూ ఏదో ఒక‌రకంగా మాట్లాడుకునేవారు. ఇద్ద‌రి మ‌ధ్య ప్రేమ చిగురించింది. మ‌న‌సులు క‌ల‌వ‌డంతో మ‌నువాడుకోవాల‌కున్నారు. ఇదే విష‌యాన్ని త‌మ కుటుంబ స‌భ్యుల‌కు చెప్పారు. ఇరు కుటుంబాలు కూడా వారి ప్రేమ‌ను అంగీక‌రించాయి.

ఖ‌తున్, హ‌సీం ఐదు రోజుల పెరోల్‌పై జైలు నుంచి విడుద‌ల‌య్యారు. బుధ‌వారం రోజు ముస్లిం సంప్ర‌దాయం ప్ర‌కారం ఆ జంట పెళ్లి ఘ‌నంగా నిర్వ‌హించారు. పెరోల్ ముగిసిన వెంట‌నే వారిద్ద‌రూ జైలుకు వెళ్లారు.

Exit mobile version