విధాత: యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మినరసింహుడికి వార్షిక బ్రహ్మోత్సవముల సందర్బంగా జడ్చర్ల కు చెందిన సుందరమ్మ అనే భక్తురాలు సుమారు 20 లక్షల రూపాయల విలువైన బంగారు ఆభరణములను విరాళముగా అందించారు. ఆలయములో వాటిని EO గీత, ప్రధానార్చకులు నందిగల్ లక్ష్మీ నరసింహచార్యులకు అందజేశారు.