ఏపీలో ఘోర అగ్నిప్ర‌మాదం.. ముగ్గురు స‌జీవ‌ద‌హ‌నం

విధాత: ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని చిత్తూరు ప‌ట్ట‌ణంలో బుధ‌వారం తెల్ల‌వారుజామున 2 గంట‌ల‌కు ఘోర అగ్నిప్ర‌మాదం జ‌రిగింది. రంగాచారి వీధిలో ఉన్న ఓ పేప‌ర్ ప్లేట్ల త‌యారీ పరిశ్ర‌మ‌లో ఒక్క‌సారిగా మంట‌లు చెల‌రేగాయి. దీంతో ఆ ప‌రిశ్ర‌మ‌లో నిద్రిస్తున్న ముగ్గురు వ్య‌క్తులు మంట‌ల్లో కాలిపోయారు. మంట‌లు ఎగిసిప‌డ‌టాన్ని గ‌మ‌నించిన స్థానికులు అగ్నిమాప‌క సిబ్బందికి స‌మాచారం అందించారు. ఘ‌ట‌నాస్థ‌లికి చేరుకున్న రెండు ఫైరింజ‌న్లు మంట‌ల‌ను అదుపు చేశాయి. మృతుల‌ను పేప‌ర్ ప్లేట్ల త‌యారీ ప‌రిశ్ర‌మ య‌జ‌మాని భాస్క‌ర్(65), ఆయ‌న కుమారులు బాబు(35), […]

  • Publish Date - September 21, 2022 / 02:45 AM IST

విధాత: ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని చిత్తూరు ప‌ట్ట‌ణంలో బుధ‌వారం తెల్ల‌వారుజామున 2 గంట‌ల‌కు ఘోర అగ్నిప్ర‌మాదం జ‌రిగింది. రంగాచారి వీధిలో ఉన్న ఓ పేప‌ర్ ప్లేట్ల త‌యారీ పరిశ్ర‌మ‌లో ఒక్క‌సారిగా మంట‌లు చెల‌రేగాయి. దీంతో ఆ ప‌రిశ్ర‌మ‌లో నిద్రిస్తున్న ముగ్గురు వ్య‌క్తులు మంట‌ల్లో కాలిపోయారు. మంట‌లు ఎగిసిప‌డ‌టాన్ని గ‌మ‌నించిన స్థానికులు అగ్నిమాప‌క సిబ్బందికి స‌మాచారం అందించారు.

ఘ‌ట‌నాస్థ‌లికి చేరుకున్న రెండు ఫైరింజ‌న్లు మంట‌ల‌ను అదుపు చేశాయి. మృతుల‌ను పేప‌ర్ ప్లేట్ల త‌యారీ ప‌రిశ్ర‌మ య‌జ‌మాని భాస్క‌ర్(65), ఆయ‌న కుమారులు బాబు(35), బాలాజీ(25)గా పోలీసులు గుర్తించారు. కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు.

ప్ర‌మాదానికి షార్ట్ స‌ర్క్యూటే కార‌ణం అయి ఉండొచ్చ‌ని పోలీసులు ప్రాథ‌మికంగా నిర్ధారించారు. మృతుల నివాసంలో విషాద‌ఛాయ‌లు అలుముకున్నాయి. కుటుంబ స‌భ్యులు, బంధువులు శోక‌సంద్రంలో మునిగిపోయారు.