Site icon vidhaatha

16 ఏండ్ల బాలుడితో.. 32 ఏండ్ల మ‌హిళ బంధం

విధాత‌: ఓ మ‌హిళ దారుణానికి పాల్ప‌డింది. ముగ్గురు పిల్ల‌ల త‌ల్లైనా ఆమె.. ఓ 16 ఏండ్ల యువ‌కుడితో లైంగిక సంబంధం కొన‌సాగిస్తోంది. వీరి సంబంధాన్ని ప‌సిగ‌ట్టిన బాధితుడి త‌ల్లి పోలీసుల‌కు ఫిర్యాదు చేయ‌డంతో అస‌లు విషయం వెలుగు చూసింది.

వివ‌రాల్లోకి వెళ్తే.. మ‌హారాష్ట్ర థానేకు చెందిన ఓ మ‌హిళ త‌న కుమారుడి(16)తో క‌లిసి ఉంటోంది. అయితే నాసిక్‌లో బంధువులు ఉండ‌టంతో ఆమె త‌న కుమారుడిని వెంటేసుకుని అప్పుడ‌ప్పుడు వెళ్లేది. బంధువుల ఇంటి ప‌క్క‌నే ఉన్న ఓ వివాహిత.. ఈ కుర్రాడిపై క‌న్నేసింది. ఇక అడ్ర‌స్ తెలుసుకున్న ఆమె.. ఆ అబ్బాయి ఇంటికి ప‌లుసార్లు వ‌చ్చింది.

ఈ క్ర‌మంలో అత‌నికి మ‌ద్యం అల‌వాటు చేయించి, శృంగార కోరిక‌ల‌ను ర‌గిల్చింది. ఇక ఆ యువ‌కుడితో శారీర‌కంగా ద‌గ్గ‌రైంది. ఈ క్ర‌మంలో బాలుడు కూడా స్కూల్ డుమ్మా కొట్టి.. నాసిక్ వెళ్ల‌డం ప్రారంభించాడు. ఆమెతో ఎక్కువ స‌మ‌యం గ‌డప‌డం ప్రారంభించాడు.

ఈ విష‌యాన్ని ప‌సిగ‌ట్టిన ఆ యువ‌కుడి త‌ల్లి పోలీసుల‌కు ఫిర్యాదు చేసింది. వీరిద్ద‌రి మ‌ధ్య 2019 నుంచి లైంగిక సంబంధాలు కొన‌సాగుతున్న‌ట్లు పోలీసుల విచార‌ణ‌లో తేలింది. వివాహితపై పోక్సో చ‌ట్టం కింద కేసు న‌మోదు చేశారు.

Exit mobile version