విధాత: ఇస్రో మరో ఘనత సాధించింది. అత్యంత బరువైన జీఎస్ఎల్వీ మార్క్-3 రాకెట్ ను విజయవంతంగా నింగిలోకి పంపింది. ఈ ప్రయోగంలో 36 ఉపగ్రహాలను నిర్ణీత కక్షలోకి చేర్చింది. నెల్లూరు శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి నిన్న అర్ధరాత్రి 12:07 గంటలకు జీఎస్ఎల్వీ నింగిలోకి దూసుకెళ్లింది.
ఇస్రో రాకెట్ జీఎస్ఎల్వీ మార్క్-3 ప్రైవేట్ కమ్యూనికేషన్ సంస్థ వన్‌వెబ్‌కు చెందిన 36 ఉపగ్రహాలను నింగిలోకి మోసుకెళ్లింది. ప్రయోగానికి 24 గంటల ముందు కౌంట్‌డౌన్ ప్రారంభించారు. వచ్చే ఏడాది మొదట్లో మరో 36 వన్‌వెబ్ ఉపగ్రహాలను జీఎస్ఎల్వీ రాకెట్ ద్వారా ప్రయోగించనున్నామని ఇస్రో ఛైర్మన్ ఎస్. సోమనాథ్ తెలిపారు.
ఒకేసారి 36 విదేశీ ఉప ప్రగహాలను అంతరిక్షంలోకి పంపించడం ద్వారా ఇస్త్రో, న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్ కి వ్యాపార పరమైన ఎన్నో లాభాలు కలిగే అవకాశం ఉంది. ఈ టైంలో 36 ఉపగ్రహాల ప్రయోగానికి వన్ బెబ్, NSIL మధ్య ఇటీవల ఒక ఒప్పందం ఏర్పాటు చేసుకున్నారు.
నాలుగు టన్నుల ఉపగ్రహాన్ని జియోసింక్రోనస్ ట్రాన్స్ ఫర్ ఆర్బిట్ కి పంపగలదు. భారత్ నుంచి నింగిలోకి పంపించే జీఎస్ఎల్వీ మార్క్-3లో… ఉపగ్రహాల ప్రయోగాన్ని చేపట్టడం ఎన్ఎస్ఐఎల్, ఇస్రోలకు ఒక చారిత్రాత్మక క్షణం అని ఎన్ఎస్ఐఎల్ ఛైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ రాధాకృష్ణన్ తెలిపారు.