Site icon vidhaatha

మునుగోడులో ఇవాళ 9 నామినేషన్లు దాఖలు

విధాత‌, నల్గొండ: మునుగోడు అసెంబ్లీ నియోజక వర్గ ఉప ఎన్నికలో మంగళవారం 9 నామినేషన్లు రిటర్నింగ్ అధికారికి దాఖలు చేశారు.

స్వతంత్ర అభ్యర్తులుగా మచ్చ సుధాకర్ రావు రెండు సెట్లు, పి.భవాని రెండు సెట్లు, ఈద శేషగిరిరావు రెండు సెట్లు, మాదగొని వెంకటేశ్వర్లు ఒక సెట్, కొలిశెట్టి శివకుమార్, యుగ తులసి పార్టీ ఒక సెట్, బేరి వెంకటేష్ స్వతంత్ర ఒక సెట్ నామినేషన్ దాఖలు చేశారు. కాగా బేరి వెంకటేష్ సోమవారం కూడా ఒక సెట్ నామినేషన్ దాఖలు చేశారు.

దీంతో మూడో రోజుల్లో దాఖలైన మొత్తం నామినేషన్ల సంఖ్య 23కు చేరింది. అంతకుముందు మొదటి రోజున ఒక నామినేషన్, రెండో రోజున 16 నామినేషన్లు దాఖలయ్యాయి. బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సోమవారం రోజున నామినేషన్ దాఖలు చేశారు.

కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయి స్రవంతి శుక్రవారం నామినేషన్లు దాఖలు చేసే అవకాశం ఉంది. మునుగోడు ఉప ఎన్నికకు ఈనెల 14తో నామినేషన్ల దాఖలు గడువు ముగియనుంది. 15న నామినేషన్ల పరిశీలన, 17 వరకు నామినేషన్ల విత్​ డ్రాకు ఈసీ గడువు ఇచ్చింది. నవంబర్ 3న పోలింగ్ జరగనుండగా.. 6న ఫలితం తేలనుంది.

Exit mobile version