Site icon vidhaatha

పెద్దగట్టు హుండీలో.. రక్తంతో రాసిన ప్రేమలేఖ

విధాత: సూర్యాపేట జిల్లా దురాజ్‌పల్లిలో ఐదు రోజుల పాటు జరిగిన పెద్దగట్టు లింగమతుల జాతరలో హుండీ లెక్కింపులో రక్తంతో రాసిన ప్రేమలేఖ అధికారులకు దొరికింది. లింగమంతుల స్వామి దర్శనానికి వచ్చిన భక్తుడు ఎవరో తన ప్రేమకు దేవుడి మద్దతు కోరుతూ ఈ లేఖ రాశారు.

తాను ప్రేమించిన అమ్మాయితో జీవితాంతం ఉండేలా దీవించు స్వామి అంటూ రక్తంతో తెల్లని పేపర్‌ పైన రాసి తన ప్రేమను కలకాలం ఉండేలా చూడాలని వేడుకోవటం అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది.

లేఖలో ప్రేమికుడు తన పేరుతో పాటు తన ప్రియురాలి పేరుకుడా రాసి మనం జీవితాంతం కలిసి ఉండాలని, మన మధ్య మరే ఆడది భార్యగా రాకూడదంటూ తన లేఖలో పేర్కొన్నాడు.

Exit mobile version