Site icon vidhaatha

జస్ట్‌ మిస్‌.. అభిమానిని కొట్టినంత పనిచేసిన బాలయ్య!

విధాత‌: నందమూరి బాలకృష్ణ ఆనందం వచ్చినా తట్టుకోలేడు.. ఆగ్రహం వచ్చినా తట్టుకోలేడు. ఇటీవల ఆయన తనకు బౌన్స‌ర్లు అవసరం లేదని, తన అభిమానులను బౌన్స‌ర్ల‌కు జీతాలు ఇచ్చి మరీ కొట్టించడం లేదని తెలిపిన సంగతి తెలిసిందే.

ఏమైనా కోపం ఉంటే నేనే నా అభిమానులను మంద‌లిస్తాను. కొన్నిసార్లు కొడతాను. కానీ నేను కొట్టానని వారు బాధపడరు. నా చెయ్యి వారిని తాకినందుకు సంతోషపడతారు. ఇక అలాంటి సంఘటన జరిగినప్పుడు సదరు అభిమాని ఏమైనా ఫీల్ అయితే వాళ్లతో మరల నేనే మాట్లాడుతాను.

అంతేగాని బౌన్స‌ర్లను పెట్టి వాళ్లకి జీతాలు ఇచ్చి మరీ నా అభిమానులను కొట్టించను అని వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు అదే సీన్ మరోసారి రిపీట్ అయినట్టు కనిపిస్తోంది.

బాలకృష్ణ నటించిన వీరసింహారెడ్డి చిత్రం ప్రీరిలీజ్ ఈవెంట్ ఒంగోలులో జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు హాజరైన బాలకృష్ణకు ఒంగోలులో ఘనస్వాగతం లభించింది. బాలయ్యను చూసేందుకు అభిమానులు, టిడిపి కార్యకర్తలు భారీగా తరలి వచ్చారు.

ఈ సందర్భంగా బాలకృష్ణ నడిచి వస్తుండగా ఓ అభిమాని శాలువా కప్పేందుకు ప్రయత్నించాడు. ఆ క్రమంలో బాలయ్య తలపై ఉన్న కళ్ళజోడుకి ఆ అభిమాని చేయి తగిలి పడిపోయింది. దాంతో నందమూరి హీరో అభిమాని పై ఓ సీరియస్ లుక్ వేశాడు.

కళ్లద్దాలు చూసుకోవా అంటూ విసుక్కున్నారు. అభిమాని ఈ ఊహించని పరిణామంతో చిన్న బుచ్చుకున్నాడు. భయపడుతూనే శాలువా క‌ప్ప‌గా ఆ శాలువాను బాలయ్య వెంటనే తీసేసారు. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాలలో వైరల్ అవుతుంది.

గతంలో కూడా బాలయ్య తనతో సెల్ఫీ తీసుకోవాలని ప్రయత్నించే వారి ఫోన్లు లాక్కోవడం, తన అసిస్టెంట్ చెప్పులు అందించలేదని కొట్టడం, కొందరు అభిమానులపై చేయి చేసుకోవడం వంటి సంఘటనలు పలు జరిగాయి. అయినా బాలయ్య రూటే సపరేటు అనిపిస్తుంది.

మొత్తానికి బాలయ్య కొట్టి చంపడం కాదు కంటి చూపుతోనే చంపేస్తా కత్తులతో కాదు కంటి చూపు చాలు అని హెచ్చరించినట్టుగా ఈ వీడియో ఉండడం చూస్తే బాలయ్య వెండితెరపైనే కాదు నిజజీవితంలో కూడా అంతేనా అనిపించక మానదు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. నెటిజన్లు పలు రకాలుగా దీనిపై కామెంట్స్ చేస్తున్నారు.

Exit mobile version