Site icon vidhaatha

BJP | రేపటి నుంచి.. బీజేపీ టికెట్లకు దరఖాస్తుల స్వీకరణ

BJP |

విధాత: తెలంగాణలో అధికార సాధనకు ప్రయత్నిస్తున్న బీజేపీ పార్టీ అభ్యర్థుల ఎంపిక దిశగానేటీ నేటీ నుండి పార్టీ టికెట్ల కోసం దరఖాస్తుల స్వీకరణ ప్రకియకు శ్రీకారం చుట్టనుంది. 4వ తేది ఉదయం 10గంటల నుంచి 10వ తేదీ సాయంత్రం నాలుగు గంటల వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు.

కాగా బీజేపీలో పార్టీ టికెట్ల కోసం దరఖాస్తులు తీసుకోవడం ఇదే మొదటిసారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. రాష్ట్రంలో ఇప్పటికే బీఆరెస్‌ తొలి జాబితాగా ఏకంగా 115మంది అభ్యర్థులను ప్రకటించింది. కాంగ్రెస్‌ పార్టీ అన్ని నియోజకవర్గాల నుంచి దరఖాస్తులను స్వీకరించి, వాటిని వడపోసి మూడు పేర్లు ఫైనల్‌ చేసి నేడో రేపో స్క్రీనింగ్‌ కమిటీ ముందు పెట్టనుంది.

బీజేపీ కూడా అభ్యర్థుల ఎంపిక ప్రక్రియను వేగవంతం చేసింది. ఇతర పార్టీల నుంచి ఎవరైన బీజేపీలో చేరితే వారు కూడా టికెట్ల కోసం దరఖాస్తులు అందించాల్సివుంది. మరోవైపు బీజేపీలో ఈ వారం రోజుల్లో పెద్ద ఎత్తున చేరికలుంటాయని ఎన్నికల కమిటీ చైర్మన్‌ ఈటల రాజేందర్‌, పార్టీ అధ్యక్షుడు జి.కిషన్‌ రెడ్డిలు ప్రకటించారు.

ఇప్పటికే పార్టీలో చేరే బీఆరెస్‌, కాంగ్రెస్‌ నేతలతో సహా వివిధ సామాజిక వర్గాల ప్రముఖులతో చర్చలు పూర్తయ్యాయని వారు వెల్లడించడం రాజకీయంగా ఆసక్తికర అంశంగా మారింది.

Exit mobile version