Site icon vidhaatha

ప్ర‌పంచ కుబేరుల జాబితా నుంచి ఆదానీ అవుట్‌..!

విధాత‌: హిండెన్ బ‌ర్గ్ దెబ్బ‌కు గౌతం ఆదానీ ఆర్థిక సామ్రాజ్యం కుప్ప‌కూలింది. ప్ర‌పంచంలోనే అత్యంత సంప‌న్నులైన 10 మందిలో గౌతం ఆదానీ స్థానం కోల్పోయాడు. హిండెన్‌బ‌ర్గ్ రిపోర్ట్‌కు పూర్వం నాలుగో స్థానంలో ఉన్న ఆదానీ ఇప్పుడు ప‌ద‌కొండో స్థానానికి ప‌డిపోయాడు. గ‌త మూడురోజుల్లోనే ఆదానీ గ్రూప్ కంపెనీల షేర్ల అమ్మ‌కాల్లో ధ‌ర‌లు పడిపోవ‌టంతో.. ఆయ‌న ఏకంగా…
34 బిలియ‌న్ డాల‌ర్లు న‌ష్ట‌పోవాల్సి వ‌చ్చింది.

ఈ మ‌ధ్య కాలంలో ప్ర‌పంచ కుబేరుల్లో ఒకుడుగా వెలుగు వెలిగి… కొంత కాలం ప్ర‌పంచంలోనే అత్యంత సంప‌న్నుడిగా నెంబ‌ర్ వ‌న్ స్థానాన్ని కైవ‌సం చేసుకొన్న ఆదానీ నేడు ప్ర‌పంచ కుబేరుల జాబితాలో స్థానం లేకుండా పోయింది. ఆ క్ర‌మంలోనే మెక్సికోకు చెందిన కార్లోస్ స్లిమ్‌, గూగుల్ కో ఫౌండ‌ర్ నెర్జీ బ్రిన్‌, మైక్రోసాఫ్ట్ సీఈఓ స్టీవ్ బార్మ‌ర్ క‌న్నా ఆదానీ వెనుక‌బడి పోయాడు.

అంత మాత్ర‌మే కాదు.. దేశంలోనే ప్ర‌ధాన పోటీదారుడు రిల‌య‌న్స్ ఇండ‌స్ట్రీస్ అధినేత‌ ముఖేశ్ అంబానీ క‌న్నా ఒక మెట్టు మాత్ర‌మే ఎగువ‌న ఉన్నాడు. ఆదాని సంప‌ద 84.4 బిలియ‌న్ డాల‌ర్లు.అయితే ముఖేశ్ అంబానీ సంప‌ద‌ 82.2 బిలియ‌న్ డాల‌ర్లుగా ఉండ‌టం గ‌మ‌నార్హం.

గత మూడు రోజులుగా అమ్ముడ‌వుతున్న షేర్లలో ఆదానీ గ్రూప్ కంపెనీలు.. త‌మ షేర్ల విలువ ప‌డిపోవ‌టం కార‌ణంగా 68 బిలియ‌న్ డాల‌ర్ల మార్కెట్ విలువ కోల్పోయాయి.ఈ నేప‌థ్యంలోంచే… ఆదానీ టోట‌ల్ ఎన‌ర్జీ లిమిటెడ్ కంపెనీ 10శాతం మేర రోజూ షేర్ల అమ్మ‌కాల్లో న‌ష్ట‌పోతున్న‌ది. అలాగే ఫ్లాగ్‌షిప్ ఆదానీ ఎంట‌ర్ ప్రైజెస్ షేర్ల ధ‌ర‌లు క‌నిష్టానికి ప‌డిపోయాయి. ఈ విధంగానే ఆదానీ గ్రూప్‌న‌కు చెందిన పది కంపెనీలు షేర్లలో ప‌డిపోయిన విలువ కార‌ణంగా 75బిలియ‌న్ డాల‌ర్లు న‌ష్ట‌పోయాయి.

ఇదిలా ఉంటే. ఆదానీ గ్రూప్ ఆఫ్ కంపెనీల్లో పెట్టుబ‌డులు పెట్ట‌డానికి గ‌తంలో ముందుకు వ‌చ్చిన కంపెనీలు వెన‌క‌ప‌ట్టు ప‌డుతున్నాయి. హిండెన్ బ‌ర్గ్ ఆరోప‌ణ‌ల త‌ర్వాత అనేక దిగ్గజ సంస్థ‌లు ఆదానీ అంటేనే అనుమానంతో వెనుక‌డుగు వేస్తున్నాయి. ఈ కోవ‌లోనే.. దుబాయి రాయ‌ల్ కుటుంబానికి చెందిన ఇంట‌ర్నేష‌న్ హోల్డింగ్ కంపెనీ కూడా పెడ‌తానన్న పెట్టుబ‌డుల‌ను పెట్ట‌డానికి ఇష్ట‌ప‌డ‌క పోవ‌టం గ‌మ‌నార్హం.

ప‌రిస్థితి చూస్తుంటే.. ప్ర‌పంచ కుబేరుడిగా వెలుగొందిన ఆదాని ఆర్థిక సామ్రాజ్యం పేక‌మేడ‌లా కూలిపోయే ప‌రిస్థితులు స్ప‌ష్టంగా క‌నిపిస్తున్నాయి. అయితే… ఆదానీ త‌న కంపెనీల షేర్ల ధ‌ర‌ల‌ను ఎక్కువ విల‌వ చూపి మ‌న బ్యాంకులు, ఆర్థిక సంస్థ‌ల‌నుంచి తీసుకున్న రుణాల ప‌రిస్థితి ఏమిట‌న్న‌ది ఆందోళ‌న క‌లిగించే అంశం. ఈ ప‌రిణామాలు దేశ ఆర్థిక వ్య‌వ‌స్థ‌పై తీవ్రంగా ఉంటాయ‌న‌టంలో సందేహం లేదు.

Exit mobile version