Adipurush |
విధాత: ప్రభాస్ నటించిన పౌరాణిక’ చిత్రం ఆదిపురుష్ పై ట్విట్టర్ వేదికగా మిశ్రమ స్పందన వచ్చింది. అభిమానులు దీనిని ‘రామాయణం ఫర్ మార్వెల్ జనరేషన్ (ముందు తరాలకు అద్భుత రామాయణం) అని అభిప్రాయ పడితే, సినీ విమర్శకులు మాత్రం మరింత కొంటెగా స్పందించారు.
ప్రభాస్, కృతి సనన్ నటించిన ఆదిపురుష్ శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలయింది. ఈ చిత్రంపై వెంటనే ట్విట్టర్ సమీక్షలు వచ్చాయి. శుక్రవారం నాటి ట్విట్టర్ ట్రెండింగ్‌లో ఆదిపురుష్ రివ్యూ టాప్‌లో నిలిచింది. ప్రభాస్ అభిమానులు బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఆకర్షణీయంగా, ఆకట్టుకునే విధంగా వుందని సంబరపడుతుంటే, VFXతో నిరాశ చెందామని మాత్రం నిర్మొహమాటంగా చెప్పారు.
ఈ సంవత్సరం బాగా ఎదురు చూస్తున్న చిత్రాల్లో ఆదిపురుష్ ఒకటి. ప్రభాస్, కృతి సనన్ జంటగా నటించిన ఈ చిత్రానికి ఓం రౌత్ దర్శకత్వం వహించారు. 500 కోట్ల భారీ బడ్జెట్‌తో రూపొందించిన ఈ సినిమాపై నిర్మాతలు భారీగానే ఆశలు పెట్టుకున్నారు. దీన్ని ప్రభాస్ అభిమానులు మాత్రం బాలీవుడ్‌లో ఇప్పటివరకు నిర్మించిన చిత్రాల్లో అత్యంత ఖరీదైన చిత్రం అని సంబరపడుతున్నారు. కానీ సినిమా ప్రేక్షకుల నుండి ఈ చిత్రంపై మిశ్రమ స్పందనలు వెలువడినాయి.
రాఘవగా ప్రభాస్ పాత్రను అభిమానులు బాగా మెచ్చుకున్నారు. నేపథ్య సంగీతానికి కూడా ప్రశంసలు దక్కాయి. కానీ VFX ఫేలవంగా ఉందనే టాక్ వచ్చింది. సినిమాలో రావణుడి పాత్ర చేసిన (సైఫ్ అలీ ఖాన్) నటనను కొందరు విమర్శించారు.
అభిమానుల్లో ఒకరు ట్వీట్ చేస్తూ, “#ఆదిపురుష్ సూపర్బ్ ఫిల్మ్. ఫుల్ & ఫుల్ ఒల్లు గగుర్పొడిచే గొప్ప సన్నివేశాలతో, మంచి నేపథ్య సంగీతం గల చిత్రం.. ప్రభాస్ నటన అద్భుతంగా వుంది . ఇతర నటీనటులు కూడా బాగా చేసారు. పాటలు చాలా నచ్చాయి, అయితే VFX బాగొలేదు, మొత్తం మీద ఈ సినిమా BLOCKBUSTER అవాలంటే బెటర్ VFX కావాలి” అని ట్వీట్ చేశారు.
మరో అభిమాని..“ఆదిపురుష్ మూవీ బాగుంది. అద్భుతమైన సినిమాటోగ్రఫీ , విజువల్స్ , గ్రాఫిక్స్ , ఫైట్స్ సీన్స్ ఒల్లు గగ్గుర్పాటు చెందే విధంగా వున్నాయి. #ప్రభాస్, కీర్తీ సనన్, సైఫ్ అలీ ఖాన్ లు జబర్ధస్త్ నటించారు . అంటూ ప్రశంసలు కురిపించారు.
“కొన్ని సినిమాలను మనం అంచనా వేయలేము . కానీ కొంత ప్రశంసించవచ్చు ఆదిపురుష్ ఈ కోవకు చెందిన చిత్రం . సెకండాఫ్ నేటి సమాజానికి కొంత నచ్చింది, సినిమా అభిమానులకు కావాల్సినంత ఉత్కంఠ, మూమెంట్ కలిగి ఉంది. నచ్చన విషయాలు ఏంటంటే VFX: స్క్రీన్‌ప్లే, సంగీతం కూడా అంతంతమాత్రంగా వున్నాయి.” అని మరో అభిమాని అభిప్రాయపడ్డారు.
నెటిజన్లు మాత్రం సినిమాలోని వీఎఫ్‌ఎక్స్, సైఫ్ అలీ ఖాన్ పాత్రలపై నిరాశ చెందినట్లు వెల్లడించారు. మరొకాయన ట్వీట్ లో ఆదిపురుష్ వీఎఫ్‌ఎక్స్ థర్డ్ క్లాస్‌తో పోల్చారు.
మరో ట్వీట్‌లో ఆదిపురుష్: రాబోయే తరాలకు అద్భుతమైన రామాయణం అని పొగిడారు. సీతారాములుగా ప్రభాస్, కృతీసనన్ లు బాగా నటించారు. .కొన్ని సీక్వెన్స్‌లు 3 డిలో బాగానే వున్నాయి. CG కూడా పర్వాలేదు. అంటూ రాసుకున్నారు.
ఓం రౌత్ దర్శకత్వం వహించిన ఆదిపురుష్‌లో రాఘవగా ప్రభాస్, జానకిగా కృతి సనన్, లక్ష్మణుడిగా సన్నీ సింగ్, బజరంగ్‌గా దేవనాగ్ దత్త్, రావణుడిగా సైఫ్ అలీ ఖాన్‌లు నటించారు. సంస్కృత ఇతిహాసం రామాయణం పై ఆధారపడి ఈ చిత్రం రూపొందించబడింది ..
కప్డా తేరే బాప్ కా, తేల్ తేరే బాప్ కా, ఆగ్ భీ తేరే బాప్ కీ, తో జలేగీ భీ తేరే బాప్ కీ- -హనుమంతుని డైలాగ్
ఇది ఏమి భాష? చిన్నప్పటి నుంచి హనుమంతుని పాత్ర చూస్తున్నా. ఇటువంటి భాష ఎప్పుడూ వినలేదు.
-కంటెంట్ స్ట్రాటజిస్ట్ సిద్ధార్థ్ ట్విట్టర్‌లో
ఆదిపురుష్ గ్రామాల్లో ప్రదర్శించే రామలీల నాటకం కంటే దరిద్రంగా ఉన్నట్టుంది. గ్రామాల్లో నాటకం వేసేవారికి వనరులుండవు, కానీ భక్తి, పాత్రలపట్ల గౌరవం ఉంటాయి. హిందూ సంస్కృతిని పునరుజ్జీవం చేసే పేరిట ఇటువంటి చెత్తను ఎవరు ముందుకు తెస్తున్నారు? ఇది సెన్సారు బోర్డును దాటుకుని ఎలా వచ్చింది? అసభ్యంగా ఉంది. -గో న్యూస్ వ్యవస్థాపకుడు, యాంకర్, రిపోర్టర్ పంకజ్ పచౌరి ట్విట్టర్‌లో
This #Adipurush appears to be worse than a village Ramlila.
The villagers have little budget but huge faith and respect for the characters.Who bankrolls such trash in the name of reviving #Hindu culture?
How did it get past the #censorboard ?
Obscene!! https://t.co/u7oM500mu5— Pankaj Pachauri (@PankajPachauri) June 16, 2023
చాలా ‘నిరుత్సాహం కలిగించింది’
ఒక్కమాటలో చెప్పాలంటే ఆదిపురుష్ చాలా నిరుత్సాహం కలిగించింది. భారీ ఎత్తున పెట్టుకున్న ఆకాంక్షలను అందుకోలేకపోయింది. ఓం రావత్ పెద్ద తారాగణంతో భారీ బడ్జెట్‌తో సినిమా తీశారు. అంతా చిత్తయిపోయింది. -సినిమా విమర్శకుడు తరణ్ ఆదర్శ్ ట్విట్టర్‌లో
#OneWordReview…#Adipurush: DISAPPOINTING.
Rating: ⭐️½#Adipurush is an EPIC DISAPPOINTMENT… Just doesn’t meet the mammoth expectations… Director #OmRaut had a dream cast and a massive budget on hand, but creates a HUGE MESS. #AdipurushReview pic.twitter.com/zQ9qge30Kv— taran adarsh (@taran_adarsh) June 16, 2023