Air India | రష్యాలో ఎయిర్‌ ఇండియా విమానం అత్యవసర ల్యాండింగ్‌..! పరిస్థితిని సమీక్షిస్తున్నామన్న అమెరికా..!!

Air India | టాటా యాజమాన్యంలోని ఎయిర్‌ విమానం మంగళవారం రష్యాలో అత్యవసర ల్యాండింగ్‌ జరిగింది. ఢిల్లీ నుంచి అమెరికాలోని శాన్‌ఫ్రాస్సిస్కో వెళ్తున్న ఎయి‌ర్‌ ఇండియా విమానంలో ఏఐ173 మంగళవారం ఇంజిన్‌లో సాంకేతిక లోపం కారణంగా రష్యాలోని మగదాన్ విమానాశ్రయానికి మళ్లించారు. అక్కడ విమానం సురక్షితంగా ల్యాండ్‌ అయ్యింది. ఈ క్రమంలో పరిస్థితిని అమెరికా నిశితంగా పరిశీలిస్తున్నది. అయితే, ఇంజిన్‌లో లోపం కారణంగా మగదాన్‌ ఎయిర్‌పోర్ట్‌లో ల్యాండ్‌ చేశామని ఎయిర్‌ ఇండియా ఒక ప్రకటనలో తెలిపింది. విమానంలో […]

  • Publish Date - June 7, 2023 / 05:21 AM IST

Air India |

టాటా యాజమాన్యంలోని ఎయిర్‌ విమానం మంగళవారం రష్యాలో అత్యవసర ల్యాండింగ్‌ జరిగింది. ఢిల్లీ నుంచి అమెరికాలోని శాన్‌ఫ్రాస్సిస్కో వెళ్తున్న ఎయి‌ర్‌ ఇండియా విమానంలో ఏఐ173 మంగళవారం ఇంజిన్‌లో సాంకేతిక లోపం కారణంగా రష్యాలోని మగదాన్ విమానాశ్రయానికి మళ్లించారు.

అక్కడ విమానం సురక్షితంగా ల్యాండ్‌ అయ్యింది. ఈ క్రమంలో పరిస్థితిని అమెరికా నిశితంగా పరిశీలిస్తున్నది. అయితే, ఇంజిన్‌లో లోపం కారణంగా మగదాన్‌ ఎయిర్‌పోర్ట్‌లో ల్యాండ్‌ చేశామని ఎయిర్‌ ఇండియా ఒక ప్రకటనలో తెలిపింది.

విమానంలో 216 మంది ప్రయాణికులతో పాటు 16 మంది సిబ్బంది ఉన్నారు. అయితే, రష్యాపై అగ్రరాజ్యం అమెరికా ఆగ్రహంగా ఉన్న విషయం తెలిసిందే. ఉక్రెయిన్‌పై మాస్కో యుద్ధం నేపథ్యంలో ఇరుదేశాల మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి.

ఈ క్రమంలో అమెరికాకు బయలుదేరిన విమానం రష్యాకు మళ్లించడంతో పరిస్థితి నిశితంగా పరిశీలిస్తున్నా మని అమెరికా విదేశాంగ శాఖ డిప్యూటీ అధికార ప్రతినిధి వేదాంత్ పటేల్ తెలిపారు. విమానంలో ఎంత మంది అమెరికా పౌరులు ఉన్నారనే విషయం తెలియదని, ఈ విషయాన్ని ధ్రువీకరించలేనన్నారు. విమానం అమెరికాకు వస్తున్నందున ఇందులో యూఎస్‌ పౌరులు ఉండే అవకాశం ఖచ్చితంగా ఉందన్నారు.

ఎయిర్‌ ఇండియాతో నిరంతరం చర్చలు జరుగుతున్నాయని, ప్రయాణికుల కోసం మరో విమానం ఏర్పాటు చేయనున్నారని తెలిపారు. అయితే, మగడాన్‌లోని ప్రయాణికులను తరలించేందుకు ఎయిర్‌ ఇండియా మరో విమానాన్ని ఏర్పాటు చేసింది. ఇవాళ ఈ విమానం బయలుదేరనున్నది. ప్రస్తుతం విమానంలోని ప్రయాణికులంతా స్థానికంగా ఉన్న హోటళ్లలో బస చేస్తున్నారు. ప్రయాణికులందరినీ సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చేందుకు అక్కడి అధికారులు సహకరిస్తున్నారని ఎయిర్‌ ఇండియా తెలిపింది.

Latest News