రంగారెడ్డి జిల్లా, విధాత బ్యూరో: హైదరాబాద్ విమానాశ్రయానికి నిన్నరాత్రి అత్యధిక సంఖ్యలో సందర్శకులు తరలి వచ్చారు. ప్రపంచంలోనే అతి పెద్ద కార్గో ఎయిర్‌ప్లేన్‌లలో ఒకటైన ఎయిర్‌బస్ బెలూగా హైదరాబాద్ విమానాశ్రయంలో దిగింది.
తిమింగలం ఆకారంలో ఉన్న బెలూగా డిసెంబరు 4వ తేదీన హైదరాబాద్ విమానాశ్రయానికి చేరుకుంది. డిసెంబర్ 5వ తేదీ 19.20 గంటల వరకు ఇక్కడ ఉంటుంది. GMR హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం ల్యాండింగ్, పార్కింగ్, టేకాఫ్ కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది.
ఎయిర్‌బస్ బెలూగా భారీ ఎయిర్ కార్గోను రవాణా చేయగల సామర్థ్యానికి ప్రసిద్ధి చెందింది. ప్రపంచంలోనే అతి పెద్ద కార్గో ఎయిర్‌క్రాఫ్ట్ Antonov An-225 మే 2016లో హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లో భారతదేశంలో మొదటిసారిగా ల్యాండింగ్ చేయబడిందని పేర్కొనడం గమనార్హం.
హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్‌ను మౌలిక సదుపాయాల బలం సాంకేతిక పారామితుల ఆధారంగా ఎంపిక చేశారు. మక్తూమ్ విమానాశ్రయం నుండి చేరుకుంది. పట్టాయా విమానాశ్రయానికి వెల్లుతుంది.