AI | ఇంటి ప‌ని చేసే వాళ్లు భ‌విష్య‌త్తులో ఎలా ఉంటారో తెలుసా.. AI విడుద‌ల చేసిన చిత్రాలు

AI | వ‌ర్క్ ఫ్రం హోం (డ‌బ్ల్యూఎఫ్‌హెచ్‌) కావాల‌ని ఉద్యోగులు యాజ‌మాన్యాలను పోరు పెడుతున్న విష‌యం తెలిసిందే. కార్యాల‌యానికి వ‌చ్చి ప‌ని చేయ‌మ‌న‌డంతో మ‌హిళా ఉద్యోగులు జాబ్ మానేస్తున్నార‌ని టీసీఎస్ నివేదిక సైతం పేర్కొంది. తాజాగా డ‌బ్ల్యూఎఫ్‌హెచ్ చేసే ఉద్యోగులు భ‌విష్య‌త్తులో ఎలా ఉంట‌ర‌నేది ఏఐ విశ్లేషించింది. డ‌బ్ల్యూఎఫ్‌హెచ్‌ చేసేవారి 90 శాతంకి పైగా ఉద్యోగ‌లు ఇళ్ల‌లో స‌రైన ఏర్పాట్లు లేవు. ఆఫీసులో ఉన్న‌ట్లు టేబుల్‌, డెస్క్‌టాప్‌, నెట్ సౌక‌ర్యం ఇలా.. వీటిని ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకున్న ఏఐ […]

  • Publish Date - June 18, 2023 / 07:21 AM IST

AI |

వ‌ర్క్ ఫ్రం హోం (డ‌బ్ల్యూఎఫ్‌హెచ్‌) కావాల‌ని ఉద్యోగులు యాజ‌మాన్యాలను పోరు పెడుతున్న విష‌యం తెలిసిందే. కార్యాల‌యానికి వ‌చ్చి ప‌ని చేయ‌మ‌న‌డంతో మ‌హిళా ఉద్యోగులు జాబ్ మానేస్తున్నార‌ని టీసీఎస్ నివేదిక సైతం పేర్కొంది. తాజాగా డ‌బ్ల్యూఎఫ్‌హెచ్ చేసే ఉద్యోగులు భ‌విష్య‌త్తులో ఎలా ఉంట‌ర‌నేది ఏఐ విశ్లేషించింది. డ‌బ్ల్యూఎఫ్‌హెచ్‌ చేసేవారి 90 శాతంకి పైగా ఉద్యోగ‌లు ఇళ్ల‌లో స‌రైన ఏర్పాట్లు లేవు. ఆఫీసులో ఉన్న‌ట్లు టేబుల్‌, డెస్క్‌టాప్‌, నెట్ సౌక‌ర్యం ఇలా.. వీటిని ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకున్న ఏఐ కొన్ని చిత్రాల‌ను విడుద‌ల చేసింది.

ఈ ఫొటోల‌ను చూశాక ఇంటి నుంచి ప‌ని చేయాలంటే క‌చ్చితంగా ఆలోచించాల్సిందే అంటారు. ఫ‌ర్నిచ‌ర్ ఎట్ వ‌ర్క్ అనే సంస్థ రూపొందించిన కాల్ప‌నిక మోడ‌ల్ అన్నా.. స‌రైన భంగిమలో కూర్చోకుండా ఇంట్లో ఎక్క‌డ ప‌డితే అక్క‌డ కూర్చుని ఆఫీస్ ప‌ని చేస్తుంది. దీంతో ఆమె మెడ భాగం పెద్ద‌గా కావ‌డం, క‌ళ్ల కింద న‌ల్ల‌టి వ‌ల‌యాలు, ప‌క్షి కాళ్ల‌లా మారిపోయిన చేతి వేళ్లు, ఊబ‌కాయం మొద‌లైన‌వి తలెత్తాయి.

ఇంటి నుంచి ప‌నిచేసే వారిలో క‌నీసం మూడో వంతు మంది స‌రైన వ‌ర్క్ స్పేస్ లేకుండానే ప‌ని చేస్తున్నార‌న్న యూనివ‌ర్సిటీ ఆఫ్ లీడ్స్ అధ్య‌య‌నం ఆధారంగా ఈ పాత్ర‌ను ప‌రిశోధ‌కులు సృష్టించారు. అన్నా ఎక్కువ‌గా మంచం మీదే కూర్చుని ప‌ని చేసేద‌ని, రోజుకి 18 గంట‌లు కంప్యూట‌ర్‌ను చూస్తూ ఉంటుంద‌ని ఏఐకి ఇన్‌పుట్ ఇచ్చారు. దాని ఆధారంగా కాస్త పెద్ద వ‌య‌సు వ‌చ్చాక అన్నా ఎలా ఉంటుందో ఏఐ ఫొటోలు డిజైన్ చేసి ఇచ్చింది.

మీరు అన్నాలా కాకూడదంటే…

భ‌విష్య‌త్తులో ఇలా అయిపోతామ‌ని ఇప్పుడు ఉద్యోగం వ‌దిలేయ‌లేం క‌దా.. అందుకే ఫిట్‌నెస్ నిపుణులు డబ్ల్యూఎఫ్ హెచ్‌లోనూ ఆరోగ్యంగా ఉండ‌టానికి కొన్ని స‌ల‌హాలు ఇస్తున్నారు. ఇంటి నుంచి ప‌ని చేసే వారు ఎప్ప‌టిక‌ప్పుడు స్వ‌ల్ప విరామాలు తీసుకుంటూ శ‌రీరాన్ని సాగ‌దీయాల‌ని డా.బ్రెయిన్ క్లార్క్ సూచించారు. క‌ళ్ల‌ను కాపాడుకోడానికి 20-20-20 సూత్రాన్ని అమలు చేయాల‌ని ఆయ‌న తెలిపారు.

20 నిమిషాలు కంప్యూట‌ర్ మీద వ‌ర్క్ చేశాక‌. 20 సెక‌న్ల పాటు 20 అడుగుల దూరంలో ఉన్న వ‌స్తువును త‌దేకంగా చూడాలి. ఇదే 20-20-20 సూత్రం. అన్నింటిక‌న్నా ముఖ్యంగా ఆఫీసులో ఎలా ఉంటుందో… దానికి కుదిరినంత ద‌గ్గ‌ర‌గా ఇంట్లో మ‌న ప‌ని ప్ర‌దేశం ఉండాలి. లైటింగ్, చెయిర్ పొజిష‌న్‌, డెస్క్‌టాప్ మొద‌లైన వాటిని స‌మ‌కూర్చుకోవాల‌ని నిపుణులు తెలిపారు.

Latest News