సినిమా పేరు మారిస్తే.. ఈ అల్లు వారబ్బాయికి హిట్టొస్తుందా?

విధాత: అప్పుడెప్పుడో వచ్చిన ‘ఏబీసీడి’ సినిమాలో కనిపించిన అల్లు శిరీష్.. మళ్లీ ఇంత వరకు ఎటువంటి సౌండ్ చేయకుండా కామ్‌గా ఉండిపోయాడు. ఫ్యామిలీ పరంగా పెద్ద బ్యాక్‌గ్రౌండ్ ఉన్నా కూడా.. అల్లు శిరీష్ హీరోగా నిలబడలేకపోతున్నాడు. రెండు, మూడు మంచి సినిమాలు ఖాతాలో ఉన్నా కూడా.. ఈ అల్లు వారబ్బాయిది సొంత బ్యానర్‌లోనే సినిమాలు చేసుకోవాల్సిన పరిస్థితి. పోనీ సొంత బ్యానర్‌లో సినిమా అయినా సక్రమంగా తెరకెక్కుతుందా అంటే అదీ లేదు. గీతా ఆర్ట్స్ 2 బ్యానర్‌లో […]

  • Publish Date - September 26, 2022 / 02:25 PM IST

విధాత: అప్పుడెప్పుడో వచ్చిన ‘ఏబీసీడి’ సినిమాలో కనిపించిన అల్లు శిరీష్.. మళ్లీ ఇంత వరకు ఎటువంటి సౌండ్ చేయకుండా కామ్‌గా ఉండిపోయాడు. ఫ్యామిలీ పరంగా పెద్ద బ్యాక్‌గ్రౌండ్ ఉన్నా కూడా.. అల్లు శిరీష్ హీరోగా నిలబడలేకపోతున్నాడు. రెండు, మూడు మంచి సినిమాలు ఖాతాలో ఉన్నా కూడా.. ఈ అల్లు వారబ్బాయిది సొంత బ్యానర్‌లోనే సినిమాలు చేసుకోవాల్సిన పరిస్థితి.

పోనీ సొంత బ్యానర్‌లో సినిమా అయినా సక్రమంగా తెరకెక్కుతుందా అంటే అదీ లేదు. గీతా ఆర్ట్స్ 2 బ్యానర్‌లో ఎప్పుడో ‘ప్రేమ కాదంట’ అని ఓ చిత్రాన్ని అల్లు శిరీష్ హీరోగా ప్రకటించారు. అను ఇమ్మాన్యుయేల్ ఈ సినిమాలో హీరోయిన్. అప్పట్లో రెండు పోస్టర్స్ కూడా వదిలారు.ఆ పోస్టర్స్‌లో ఈసారి మంచి కథతోనే శిరీష్ వస్తున్నాడని అంతా అనుకున్నారు.. కానీ ఏం లాభం. ఆ పోస్టర్స్ వచ్చి కూడా దాదాపు సంవత్సరం కావస్తోంది. మళ్లీ ఇప్పుడు ఆ సినిమాకు సంబంధించి ఓ అప్‌డేట్‌ వచ్చింది.

ఆ అప్‌డేట్ ఏమిటంటే.. ‘ప్రేమ కాదంట’ సినిమానే పేరు మార్చి నవంబర్ 4వ తేదీన విడుదల చేస్తున్నామని మేకర్స్ ప్రకటించారు. ‘ప్రేమ కాదంట’ పేరును ‘ఊర్వశివో రాక్షసివో’ అని మార్చారు. అయితే పేరు మారిస్తే ఫేట్ మారుతుందా? అల్లు వారబ్బాయికి సూపర్ హిట్ వచ్చేస్తుందా? అసలు ‘ప్రేమ కాదంట’ అన్నప్పుడే.. కాస్త ఈ సినిమాపై అందరి దృష్టి పడింది. ఇప్పుడు పెట్టిన టైటిల్ అస్సలు.. ఇదొక సినిమాయేనా? అని మాట్లాడుకునేలా చేస్తోంది. ఈ నిర్ణయం ఎవరిదో గానీ.. సినిమాపై ఉన్న కాస్త క్రేజ్ కూడా పోగోట్టేశారు. ఇక నవంబర్ 4 ఈ అల్లు వారబ్బాయి పరిస్థితి ఏమిటో చూడాలి.

పోతే.. ఈ సినిమా టీజర్‌ని సెప్టెంబర్ 29న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లుగా నిర్మాతలు ప్రకటించారు. శ్రీ తిరుమల ప్రొడక్షన్స్‌తో కలిసి GA2 పిక్చర్స్ నిర్మిస్తోన్న ఈ చిత్రానికి కల్యాణ్ దేవ్‌తో ‘విజేత’ చిత్రాన్ని రూపొందించిన రాకేశ్ శశి దర్శకుడు. ధీరజ్ మొగిలినేని నిర్మాతగా వ్యవహరిస్తోన్న ఈ చిత్రాన్ని అల్లు అరవింద్ సమర్పిస్తున్నారు. నవంబర్ 4న ‘శాకుంతలం’ చిత్రానికి పోటీగా ఈ చిత్రం థియేటర్లలోకి రానుంది.

Latest News