అమలాపాల్‌కు ఘోర అవమానం.. ఆలయంలోకి నో ఎంట్రీ

విధాత: తిరుమలలో కూడా శ్రీ వేంకటేశ్వర స్వామి దర్శనం చేసుకోవాలని ఇత‌ర మ‌త‌స్థులు భావిస్తే దేవాలయంలో ప్రవేశించే ముందు ఇతర మతస్తులు వెంకటేశ్వర స్వామి మీద తమకు ఎంతో నమ్మకముందనే డిక్ల‌రేష‌న్‌పై సంత‌కం చేయాలి. ఇక శబరిమలైలో అయ్యప్ప దర్శనానికి ఆడ వారిని అనుమతించరు. ఈ విషయంపై నాడు చాలా కాలం క్రితం పెద్ద రాద్ధాంతం జరిగింది. తాజాగా ఇలాంటి సంఘటన మరోటి జరిగింది. కేర‌ళ‌లోని ఎర్నాకులంలో కొలువై ఉన్న తిరువైరానికులం మ‌హాదేవ ఆలయంలోకి ప్రవేశించడానికి అధికారులు […]

  • Publish Date - January 21, 2023 / 03:21 AM IST

విధాత: తిరుమలలో కూడా శ్రీ వేంకటేశ్వర స్వామి దర్శనం చేసుకోవాలని ఇత‌ర మ‌త‌స్థులు భావిస్తే దేవాలయంలో ప్రవేశించే ముందు ఇతర మతస్తులు వెంకటేశ్వర స్వామి మీద తమకు ఎంతో నమ్మకముందనే డిక్ల‌రేష‌న్‌పై సంత‌కం చేయాలి. ఇక శబరిమలైలో అయ్యప్ప దర్శనానికి ఆడ వారిని అనుమతించరు. ఈ విషయంపై నాడు చాలా కాలం క్రితం పెద్ద రాద్ధాంతం జరిగింది.

తాజాగా ఇలాంటి సంఘటన మరోటి జరిగింది. కేర‌ళ‌లోని ఎర్నాకులంలో కొలువై ఉన్న తిరువైరానికులం మ‌హాదేవ ఆలయంలోకి ప్రవేశించడానికి అధికారులు తనకు అనుమతి నిరాకరించార‌ని సినీ నటి అమలా పాల్ ఆరోపించింది. దేవాలయ ప్రాంగణంలోకి హిందువులను మాత్రమే అనుమతించే ఆచారాలను ఉటంకిస్తూ ఆలయ అధికారులను సదరు కథానాయిక విమర్శించారు. ఆలయ అధికారులు తనకు దైవ దర్శనం నిరాకరించినట్లు తీవ్ర ఆరోపణలను కుప్పించారు.

అమలాపాల్ ఆలయాన్ని సందర్శించాలని ప్రయత్నించారు. కానీ ఆమెకు దైవదర్శనం నిరాకరించారు. ఆలయం ముందు ఉన్న రహదారిలోనే నిలబడి అమ్మవారి దర్శనం చేసుకోమని బలవంతం చేశారు. ఆలయ సందర్శకుల రిజిస్టర్లో అమలాపాల్ తన అనుభవాన్ని షేర్ చేసుకున్నారు. తాను అమ్మ వారిని చూడకపోయినా ఆత్మను సందర్శించానని అమలాపాల్ తన భక్తి చాటుకున్నారు.

2023లోకి ప్రవేశించాం. ఈ ఆధునిక డిజిటల్ సమాజంలో ఇంకా మతపరమైన వివక్ష కొనసాగటం విచారకరమని పాల్ నిరాశను వ్యక్తం చేశారు. నేను దేవత దగ్గరికి వెళ్ళ లేకపోయాను. కానీ దూరం నుంచి ఆత్మను అనుభ‌వించ‌గ‌లిగాను. త్వరలో మతపరమైన వివక్షలో మార్పు వస్తుందని ఆశిస్తున్నాను. సమయం వస్తుంది. మనల్ని అందర్నీ మతం ప్రాతిపదికన కాకుండా సమానంగా చూస్తారని ఆమె ఆలయ సందర్శకుల రిజిస్టర్లో రాశారు.

ఈ సంఘ‌ట‌న వెలుగులోకి రావడంతో ఈ ఆలయం ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆలయ నిర్వాహకులు స్పందించారు. ఓ జాతీయ మీడియా కథనం ప్రకారం తాము ఇప్పటికే ఉన్న ప్రోటోకాల్‌ని మాత్రమే అనుసరిస్తున్నామని ఆలయ అధికారులు వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు.

ఇతర మతాలకు చెందిన భక్తులు చాలామంది ఆలయాన్ని సందర్శించేందుకు వస్తూ ఉంటారని.. అయితే ఈ విషయం ఎవరికీ తెలియదని.. ఎవరైనా సెలబ్రిటీ లేదా ప్రముఖులు ఆలయానికి వస్తేనే అది వివాదాస్పదం అవుతుందని ట్రస్ట్ కార్యదర్శి సెటైర్ వేశారు.

అయితే గతంలో ఇందిరా గాంధీకి సైతం శబరిమలై అయ్యప్ప స్వామి దర్శనం వీలుకాదని నాడు అభ్యంతరం తెలిపిన సంగతి చాలామందికి తెలిసే ఉంటుంది.

Latest News