Site icon vidhaatha

Amrit Bharat | 508 అమృత్ భారత్ స్టేషన్లకు ప్రధాని మోడీ శంకుస్థాపన

Amrit Bharat

విధాత: దేశ వ్యాప్తంగా ఒకేసారి 508 అమృత్ భారత్ రైల్వే స్టేషన్లకు ప్రధాని మోడీ వర్చువల్‌గా శంకుస్థాపన చేశారు.

రైల్వే స్టేషన్ల ఆధునీకరణలో భాగంగా అమృత్ భారత్ రైల్వే స్టేషన్ల నిర్మాణం చేపట్టడం జరిగిందని, ఇది దేశ రైల్వే చరిత్రలో కొత్త అధ్యాయనమన్నారు.

అమృత్ భారత్ రైల్వే స్టేషన్లలో భాగంగా తెలంగాణలో 21, ఏపీలో 18 రైల్వే స్టేషన్లకు మోదీ శంకుస్థాపన చేశారు.

ఈ కార్యక్రమంలో నాంపల్లి రైల్వే స్టేషన్‌లో గవర్నర్ తమిళ సై సౌందర రాజన్‌, కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డి, కరీనంగర్ లో బండి సంజయ్‌, రామగుండంలో వివేక్ వెంకటస్వామి, జనగామా రైల్వే స్టేషన్‌లో ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డిలు పాల్గొన్నారు.

Exit mobile version