అర్బన్ నక్సల్స్‌ అంటూ బండి వ్యాఖ్యలు.. ప్రశ్నించే గొంతుకల నోరు నొక్కే ప్రయత్నమేనా…?

అర్బన్ నక్సల్స్ పట్టణాల్లో జల్సా చేస్తున్నారని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ విమర్శించారు. వారిని చూసి మోసపోవద్దంటూ ప్రజలకు ఆయన స్పష్టం చేశారు. మంగళవారం వేములవాడలో ఆయన విలేకర్లతో మాట్లాడుతూ చెప్పడం ఇప్పుడు పలువురు మేధావులను ఆలోచింప జేస్తుంది.

అర్బన్ నక్సల్స్ పట్టణాల్లో జల్సా చేస్తున్నారని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ విమర్శించారు. వారిని చూసి మోసపోవద్దంటూ ప్రజలకు ఆయన స్పష్టం చేశారు. మంగళవారం వేములవాడలో ఆయన విలేకర్లతో మాట్లాడుతూ చెప్పడం ఇప్పుడు పలువురు మేధావులను ఆలోచింప జేస్తుంది.

ఏ పార్టీ అధికారంలో ఉన్నా.. పైరవీలు చేసుకుంటూ ఆస్తులు పోగేసుకుంటున్నారని అర్బన్ నక్సల్స్‌పై అనే పదం వాడుతూ నిప్పులు చెరిగారు. వారి మాటలు నమ్మి అమాయకలు, పేద యువత తుపాకీ పట్టి అడవుల్లో తిండి తిప్పలు లేకుండా తిరుగుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తూ ఒక కొత్త బాష్యం చెప్పుకొచ్చారు. మావోయిస్టుల మరణాలకు అర్బన్ నక్సల్స్ కారకులని తెలిపారు. నక్సల్స్‌కు సపోర్ట్ చేసే అర్బన్ నక్సల్స్ ద్రోహులని ఆయన అభివర్ణిస్తూ, తక్షణమే తుపాకీ వీడి జన జీవన స్రవంతిలో కలవాలని మావోయిస్టులకు కేంద్ర మంత్రి బండి సంజయ్ హుకుం జారీ చేయడం వెనుక పెద్ద కారణం ఉందా అనిపిస్తుంది. మరో 4 నెలల గడువు మాత్రమే ఉదంటూ ఈ సందర్భంగా మావోయిస్టులకు ఆయన గుర్తు చేశారు. వచ్చే మార్చి నాటికి మావోయిజాన్ని అంతం చేసి తీరుతామని కేంద్ర మంత్రి బండి సంజయ్ ధీమా వ్యక్తం చేశారు.

ఆంధ్రప్రదేశ్‌ అల్లూరి సీతారామరాజు జిల్లాలోని మారేడుమిల్లి ఏజెన్సీ ప్రాంతంలో మంగళవారం తెల్లవారుజామున భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. దీనిలో మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు, అగ్రనేత హిడ్మాతోపాటు పలువురు మావోయిస్టులు మరణించిన మరుసటి రోజే మావోలను వదిలి బండి సంజయ్ కొత్తగా అర్బన్ నక్సల్ పదాన్ని పదే, పదే వాడుతూ, ఆ పదంలో కొత్త అర్దాన్ని వెతికి పబ్లిక్ కి చూపించే ప్రయత్నం చేసాడు. అర్బన్ నక్సల్ అనడం వెనుక ఆంతర్యం ఏమిటి….?, మరో సంక్షోభం ఉన్నట్లు చెప్పకనే ఆయన చెపుతున్నారా…?, బీజేపీ ప్రభుత్వం ప్రశ్నించే గొంతుకలను ఆ పేరుతో పిలుస్తు భయ పెట్టె ప్రక్రియ చేపట్టిందా…? అనే అనుమానం ప్రజల్లో, ప్రజాస్వామిక వాదుల్లో, మేధావులు, ప్రశ్నించే గొంతుకల్లో వ్యక్తం అవుతుంది.

ప్రశ్నించే గొంతుకలకు ‘అర్బన్ నక్సల్’ ట్యాగ్‌ భయమా….?

దేశంలో మావోయిజంపై కేంద్ర హోమ్ శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ వ్యాఖ్యలు ఇప్పుడు కేంద్ర బిందువు అవుతున్న వేళ…కొత్త రాజకీయ సంకేతాలను విసురుతున్నాయి. “అర్బన్ నక్సల్స్ తస్మాత్ జాగ్రత్త అంటూ…నాలుగు నెలల్లో మావోయిజం అంతం…” అని ఆయన అంటున్న మాటల సాధారణమైనవి కావు. దేశంలో భద్రత, ప్రజాస్వామ్యం, విపక్ష స్వరం, పౌర సమాజం అన్నింటినీ తాకే పెద్ద ఒక పెద్ద ప్రశ్న, సవాల్ అనిపిస్తుంది.

గత దశాబ్దంలో ‘అర్బన్ నక్సల్’ అన్న పదం అత్యంత ప్రమాదకరమైన రాజకీయ ట్యాగ్‌గా బీజేపీ ప్రభుత్వం ప్రచారం చేస్తుంది. సామాన్యంగా మావోయిస్టులకు మేధోపరమైన సహాయం చేసే వారు అంటున్నప్పటికి, కేంద్ర మంత్రి సంజయ్ ప్రవర్తన చూస్తే ఈ పదం ప్రభుత్వానికి అసౌకర్యంగా ఉన్న, ప్రశ్నించే ప్రతి స్వరం మీద ఈ ముద్ర వేసే ఆయుధంగా వాడుకొనున్నట్లు ఉంది. సామాజిక కార్యకర్తలు, పత్రికా రచయితలు, విద్యార్థి నేతలు, మానవ హక్కుల సంఘాలు, భూమి, అడవి,ఆదివాసి హక్కులపై మాట్లాడేవారెవరైనా ప్రభుత్వ విధానాల్ని ప్రశ్నించినా, “అర్బన్ నక్సల్” అన్న ముద్రతో వారిని నిశ్శబ్దం చేసే ప్రయత్నాలు దేశవ్యాప్తంగా తరచూ చూసాం.ప్రస్తుతం చూడొబోతున్న ఆందోళన కళ్లకు కనపడే విధంగా చూపే ప్రయత్నం కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి హోదాలో బండి సంజయ్ చెప్పడం గమనార్హం. మావోయిజం నిర్మూలన పేరుతో ప్రశ్నించే వారిని, హక్కుల సంఘాల నేతలను అర్బన్ నక్సల్ పేరు మీద ప్రతీకారం తీర్చుకొనే పని మోదలైందా అని అనుమానం కలుగుతుంది. అదే జరిగితే ప్రజాస్వామ్యంలో ఇది మరో శఖానికి నాంది కాకపోదు.

అసలు ప్రమాదం ఎక్కడ ఉంది?

మావోయిస్టులపై ఆపరేషన్ తీవ్రమవుతోంది, వేల కేసులు, అరెస్టులు, లొంగిపోవడం, ఎన్‌కౌంటర్లు ఇది భద్రతా వ్యవస్థ పరంగా ప్రభుత్వ లక్ష్యాలు స్పష్టమే. ఈ నేపథ్యంలో బండి సంజయ్ అన్నట్లు పట్టణాల్లో జల్సా చేస్తున్న అర్బన్ నక్సల్స్ అన్న వ్యాఖ్య… పట్టణాల్లో డిస్సెంట్ గా, ప్రజాస్వామ్య హక్కుగా ఉన్న గొంతుకలపై నిర్భంద దృష్టి పెరుగుతోందని సంకేతం ఇస్తుంది. మావోలను దృష్టిలో పెట్టుకొని ప్రశ్నించే స్వరాలను అణిచివేయడం ప్రజాస్వామ్యానికి పెద్ద సంక్షోభం కాకా మానదు.

ప్రశ్నించే గొంతుకలు ఏమి చేయాలి?

ప్రశ్నించడమే ప్రజాస్వామ్య లక్షణం అది ఎవరి కృప కాదు, రాజ్యాంగ పరమైన ప్రజల హక్కు. ఈ నేపథ్యంలో ప్రశ్నించే గొంతుకలు సైతం తీసుకోవాల్సిన మార్గం స్పష్టంగా ఉందడాలి. వాస్తవాల ఆధారంగా మాట్లాడాలి, ఆక్రోశం వీడి, నిరూపణలు ఎత్తి చూపాలి. దృవీకరణలతో, డేటాతో, పరిశోధనలతో విమర్శలు చేస్తే ప్రభుత్వం వేసే ఎలాంటి అర్బన్ నక్సల్ ట్యాగ్ పనిచేయదు. చట్టపరంగా రక్షణ పొందాలి. ప్రభుత్వం ముద్ర వేసే ప్రయత్నాలు జరిగితే హైకోర్టు, సుప్రీంకోర్టు వరకు వెళ్లే హక్కు పౌరునికి ఉంది. కలసి కట్టుగా స్వరం ఎత్తాలి, ‘అర్బన్ నక్సల్’ అనే ముద్ర వేయాలి అని ప్రభుత్వం బావిస్తే మీడియా వర్గాలు, పౌరసమాజం, న్యాయ వేత్తలు, మానవ హక్కుల సంఘాలు కలిసివస్తే ప్రభుత్వం చేసే కుటిల చర్యలు ఏవి పనికిరావు. ప్రజలను మిత్రులుగా చేసుకోవాలి, ప్రజలకు ఒకసారిసత్యం తెలిసిందంటే, ఎలాంటి ముద్రలు పాలకులు వేసిన అటువంటి ప్రచారం నిలవదు. సంపూర్ణ పారదర్శకతే ప్రశ్నించే వర్గానికి యథార్థ రక్షణగా మారుతుంది.

కొత్త సంక్షోభానికి సంకేతమా?

కేంద్ర మంత్రి బండి సంజయ్ వ్యాఖ్యలు, మావోయిజం నిర్మూలన టైమ్‌లైన్, ఎన్‌కౌంటర్లు, ఇవి మొత్తం కలిపి చూస్తే సెక్యూరిటీ నేరేటివ్ పెంచి, రాజకీయ వ్యతిరేక స్వరాలను కూడా అదే వర్గంలోకి నెట్టే ప్రయత్నం జరిగే ప్రమాదం ఉందని నాయ నిపుణులు సూచిస్తున్నారు. మరోవైపు ఎన్నికల సంవత్సరం దగ్గర పడుతోంది. భారత రాజకీయాల్లో ‘నేషనల్ సెక్యూరిటీ’ అనే శక్తివంతమైన ఆయుధం వాడుకొని అధికారంలోకి మళ్ళీ రావాలనే బీజేపీ తన మంత్రులతో ఇటువంటి సంకేతాలు ఇస్తున్నట్లు స్పష్టంగా కనిపిస్తున్నాయి.

ఏదైమైనా మావోయిజం నిర్మూలన భారతదేశం కోరుకున్నదే. కానీ ప్రజాస్వామ్య హక్కులకు భంగం కలగకుండా అది జరగాలి. ప్రశ్నించే స్వరాలు, దేశానికి వ్యతిరేకం కాదు. అవి దేశానికే రక్షణ అని గత రెండవ ప్రపంచ యుద్ధకాలంలో జరిగిన పరిణామాలు ప్రభుత్వం గుర్తు తెచ్చుకోవాలి. అర్బన్ నక్సల్ అన్న పదం భద్రతా సమస్య అంటూ ఆయా ప్రభుత్వాలు రాజకీయంగా ఉపయోగించుకుంటే పౌరులు జాగ్రత్తగా, అప్రమత్తంగా, సంఘటితంగా పోరాడాల్సిన అవసరం ఉంది.

డి. వై. గిరి
సీనియర్ ఇండిపెండెంట్ జర్నలిస్ట్
హైదరాబాద్
సెల్ : 7013667743

Latest News