Amy Jackson |
బాలీవుడ్ బ్యూటీ అమీ జాక్సన్ గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. 2010లో ఆర్య హీరోగా నటించిన ‘మదరాసిపట్నం’ అనే తమిళ సినిమాతో తెరంగేట్రం చేయగా, ‘ఏంమాయ చేశావే’ హిందీ రీమేక్ గా తెరకెక్కిన ‘ఏక్ దివానా థా’ మూవీతో బాలీవుడ్‌లో అడుగుపెట్టింది. ఇక అమీ జాక్సన్ తెలుగులో ఎవడు చిత్రంలో రామ్ చరణ్ సరసన నటించింది.
రజనీకాంత్ నటించిన రోబో 2.0లో కీలక పాత్ర పోషించి మెప్పించింది.విక్రమ్‌తో ఐ అనే సినిమా కూడా చేసింది. కెరీర్‌లో పెద్ద హీరోలతో కలిసి పని చేసిన కూడా అమీ జాక్సన్ ఎందుకో స్టార్ స్టేటస్ అంది పుచ్చుకుంది. సినిమాల పరంగా అమీ జాక్సన్‌కి లక్ పెద్దగా కలిసి రాకపోవడంతో లండన్ చెక్కేసింది.
అమీ జాక్సన్ సోషల్ మీడియాలో అందాల ప్రకంపనలు పుట్టిస్తూ కాక రేపుతూ ఉంటుంది. 2015 నుంచి బ్రిటన్ బిజినెస్ మ్యాన్ ఆండ్రియాస్ పనయియోటౌ కుమారుడు జార్జ్ పనయిటౌతో డేటింగ్ చేసిన అమీ జాక్సన్ అతనితో ఎంగేజ్‌మెంట్ జరుపుకున్న తర్వాత తాను ప్రగ్నెంట్ విషయాన్ని వెల్లడించింది.
పెళ్లి కాకుండానే ప్రగ్నెంట్ అయిన అమీ బేబి బంప్ పిక్స్ తో సోషల్ మీడియాలో నానా రచ్చ చేసింది. ఇక 2019 సెప్టెంబర్ లో పండంటి మగబిడ్డకు జన్మిచ్చిన ఈ భామ.. 2022లో జార్జ్ తో బ్రేకప్ చెప్పి ఎగ్ వెస్ట్ విక్ అనే ఇంగ్లీష్ నటుడితో డేటింగ్ మొదలు పెట్టింది.
ఇక రీసెంట్‌గా ప్రియుడితో కలిసి ఇండియా వచ్చిన ఈ బ్యూటీ.. ముంబయ్ లో వివిధ ప్రాంతాలు సందర్శిస్తూ ఎంజాయ్ చేస్తుంది. హనీమూన్ ట్రిప్‌లో భాగంగా వీరిద్దరు వివిధ ప్రాంతాలలో చక్కర్లు కొడుతున్నారు. ఈ క్రమంలోనే ముంబయ్ లోని గేట్ వే ఆఫ్ ఇండియాను విజిట్ చేయగా, అక్కడ ఈ స్టార్ కపుల్ చేసిన పని హాట్ టాపిక్ అయింది.
ఇండియా టూర్ లో భాగంగా గేట్ వే ఆఫ్ ఇండియా, తాజ్ మహల్ ప్యాలెస్ హోటల్ లో వీరు తీసుకున్న ఫొటోలని అమీ జాక్సన్ షేర్ చేయగా, గేట్ వే ఆఫ్ ఇండియా ముందు లిప్ లాక్ లతో రెచ్చిపోవడంపై కొందరు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ బ్యూటీ ఐదేళ్ల గ్యాప్ తర్వాత మళ్లీ ‘మిషన్ చాప్టర్ 1’ అనే తమిళ్ మూవీతో రీఎంట్రీ ఇస్తుంది. ఇందులో అరుణ్ విజయ్ తో కలసి నటిస్తోంది. అతి త్వరలోనే ఈ మూవీ రిలీజ్ కానుంది.